రామ్ చరణ్ కి సోలో క్రెడిట్ రాదా?

రామ్ చరణ్ RRR, ఆచార్య తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడో అనే క్యూరియాసిటిలో ఆయన ఫాన్స్ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం రామ్ చరణ్ ఆచార్య, RRR తో [more]

Update: 2020-12-18 05:13 GMT

రామ్ చరణ్ RRR, ఆచార్య తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడో అనే క్యూరియాసిటిలో ఆయన ఫాన్స్ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం రామ్ చరణ్ ఆచార్య, RRR తో మల్టీస్టారర్ సినిమాలే చేస్తున్నాడు. RRR లో ఎన్టీఆర్ తోనూ, ఆచర్యలో చిరు తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అయితే RRR సినిమా తాలూకు రిసల్ట్ ని రామ్ చరణ్ అటు రాజమౌళితోను ఇటు ఎన్టీఆర్ తోనూ పంచుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప సోలో క్రెడిట్ దక్కదు. ఎంతగా రామ్ చరణ్ రోల్ హైలెట్ అయినా ఎన్టీఆర్ పక్కనే ఉంటాడు. మరోపక్క రాజమౌళి ని తెగ పొగుడుతారు తప్ప రామ్ చరణ్ ఒక్కడినే ఎత్తరు.

మరోపక్క తండ్రి చిరు సినిమాలోనూ రామ్ చరణ్ ఓ రోల్ చేస్తున్నాడు. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ జస్ట్ గెస్ట్ రోల్ అనుకుంటే.. కాదు అది చిరు తో పాటు ట్రావెల్ చేసే కీలక పాత్ర అంటూ కొరటాల తేల్చేసాడు. ఇప్పుడు అదే సినిమాలో ఎంత కీ రోల్ ప్లే చేసినా ఖచ్చితంగా మేజర్ క్రెడిట్ మాత్రం తండ్రి చిరుకే ఇవ్వాల్సి వస్తుంది. అలాగే కొరటాలతో కలిసి క్రెడిట్ పంచుకోవాల్సి వస్తుంది.మరి ఇలా రెండు సినిమాల్లోనూ ఎవరో ఒకరితో క్రెడిట్ పంచుకోవాల్సి వస్తే.. రామ్ చరణ్ కి సోలో క్రెడిట్ ఎప్పుడు దక్కుతుంది. ఆయన నెక్స్ట్ సినిమాపై ఇంకా ఎలాంటి క్లారిటీ కూడా లేదు.

Tags:    

Similar News