మహేష్ ఫాన్స్ కి చేదు వార్త
మరో మూడు రోజుల్లో మహేష్ తండ్రి కృష్ణగారి పుట్టిన రోజు నాడు.. మహేష్ కొత్త సినిమా సర్కారు వారి పాట నుండి టీజర్ కానీ, మహేష్ బాబు [more]
మరో మూడు రోజుల్లో మహేష్ తండ్రి కృష్ణగారి పుట్టిన రోజు నాడు.. మహేష్ కొత్త సినిమా సర్కారు వారి పాట నుండి టీజర్ కానీ, మహేష్ బాబు [more]
మరో మూడు రోజుల్లో మహేష్ తండ్రి కృష్ణగారి పుట్టిన రోజు నాడు.. మహేష్ కొత్త సినిమా సర్కారు వారి పాట నుండి టీజర్ కానీ, మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ రిలీజ్ చేస్తారని, అలాగే మహేష్ కొత్త సినిమా SSMB28 నుండి ఏదో ఒక అప్ డేట్ రాకపోదు అని మహేష్ ఫాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు. ఎంత పాండమిక్ టైం అయినా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఆయన కొత్త సినిమా పోస్టర్ తో సహా.. ఆయన నటించబోయే సినిమాల అప్ డేట్స్ ఇచ్చి ఫాన్స్ ని సర్ప్రైజ్ చేసారు. ఇప్పుడు మహేష్ ఫాదర్ కృష్ణ గారి పుట్టిన రోజుకి మహేష్ తన సెంటిమెంట్ ప్రకారం ఎదో ఒక సర్ప్రైజ్ ఉంటుంది అనుకుంటున్నారు.
కానీ మహేష్ పీఆర్ టీం మాత్రం ప్రస్తుతం ఉన్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ తదుపరి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని చిత్రబృందం భావించింది. సినిమా అప్ డేట్స్ గురించి ఫాన్స్ కానీ ఇతరులు కానీ అనధికారికంగా, అవాస్తవాలను దయచేసి సృష్టించవద్దు. ఒకవేళ తమ సినిమా నుండి ఏ అప్ డేట్ అయినా అధికారిక ఖాతాల్లో తప్పకుండా పోస్ట్ చేస్తాం.. అంటూ ట్వీట్ చేసేసరికి కృష్ణ బర్త్ డే రోజున మహేష్ ఫాన్స్ కి డిస్పాయింట్ తప్పదనే అనుకుంటున్నారు. మహేష్ సర్కారు వారి పాట లుక్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది అని భావిస్తున్న ఫాన్స్ కి ఇది నిజంగా చేదు వార్తే.