చిల్లరి కామెడీ చేస్తున్నారంటూ ఫైర్ అయిన నోయెల్!!

బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయినప్పుడు చాలా అగ్రెస్సివ్ గా ఉన్న సింగర్ కం నటుడు నోయెల్.. నాగ్ క్లాస్ తో చాలా కామ్ అయ్యాడు. [more]

Update: 2020-11-01 05:11 GMT

బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయినప్పుడు చాలా అగ్రెస్సివ్ గా ఉన్న సింగర్ కం నటుడు నోయెల్.. నాగ్ క్లాస్ తో చాలా కామ్ అయ్యాడు. అందులోనూ నోయెల్ కి ఎదో తెలియని అనారోగ్యం కూడాఉంది. గురువారం బిగ్ బాస్ నుండి అనారోగ్య కారణాలతో బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన నోయెల్.. ట్రీట్మెంట్ తీసుకోవడమే కాదు… ఈ శనివారం నాగార్జున ఎపిసోడ్ లో నాగ్ పక్కన బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నోయెల్ ని బిగ్ బాస్ డాక్టర్ పరీక్ష చేసి. బెటర్ ట్రీట్మెంట్ కోసం బయటికి తీసుకురావడమే కాదు…. మళ్ళీ త్వరలోనే నోయెల్ హౌస్ లోకి రావాలంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక నోయెల్ కి కరోనా అని.. కాదు వేరే ఏదో ఒక రకమైన అనారోగ్యం అని అంటూ ఏదేదో ప్రచారం జరిగింది.

ఇక అనారోగ్యంతో హాస్పిటల్ కి వెళ్లిన నోయెల్ నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపించడమే కాదు… బిగ్ బాస్ హౌస్ లో కామెడీ చేసే అవినాష్ ని అమ్మ రాజశేఖర్ ని దులిపేసాడు. తన అనారోగ్యం మీద వాళ్ళు కామెడీ చేసారని.. అవినాష్ ని, అమ్మ రాజశేఖర్ ని ఒంటి కాలి మీద నించోబెట్టి తాను అనుభవించిన పెయిన్ ఎలా ఉంటుందో వాళ్లకి చూపించాడు. నా కాళ్ళ నొప్పుల మీద అవినాష్ కామెడీ చేసాడు. అది కోట్లమంది ప్రేక్షకులు చూస్తున్నారు. మీరు చేసే కామెడీ చిల్లర కామెడీ అంటూ అవినాష్ – అమ్మ రాజశేఖర్ మీద ఫైర్ అవడంతో.. అవినాష్ కూడా రెచ్చిపోయి.. నువ్వు మమ్మల్ని బయటికి వెళుతూ అందరి ముందు బ్యాడ్ చెయ్యాలని డిసైడ్ అయ్యావు.. అనగానే నోయెల్ కూడా ఎక్కడా తగ్గకుండా ఐ డోంట్ కేర్ అనడంతో అమ్మ రాజశేఖర్ కూడా నోయెల్ నీ మాటలతో మేము అగ్రీ అవ్వం అని అన్నాడు. మరి అవినాష్ – నోయెల్ మతాల యుద్ధం అక్కడే ఉన్న నాగ్ సైలెంట్ గా వింటూ ఉండిపోయాడు.

Tags:    

Similar News