ఈ ప్రమోషన్స్ చాలవు బాస్!!

ప్రస్తుతం కరోనా కారణంగా బడ్జెట్ ప్రోబ్లెంస్ తలెత్తడం, అప్పులు కట్టలేని నిర్మాతలు సినిమాలను ఓటిటీలకు అమ్ముకుంటున్నారు. అయితే సినిమాలు ఓటిటిలలో విదుడవుతున్న విషయం సగంమంది ప్రేక్షకులకు రీచ్ [more]

Update: 2020-11-16 05:22 GMT

ప్రస్తుతం కరోనా కారణంగా బడ్జెట్ ప్రోబ్లెంస్ తలెత్తడం, అప్పులు కట్టలేని నిర్మాతలు సినిమాలను ఓటిటీలకు అమ్ముకుంటున్నారు. అయితే సినిమాలు ఓటిటిలలో విదుడవుతున్న విషయం సగంమంది ప్రేక్షకులకు రీచ్ కావడం లేదు. అదే థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అయితే.. ప్రతి సినిమాకి ఓ రేంజ్ ప్రమోషన్స్ ఉండేవి. ఒకటి సినిమా ట్రైలర్ లాంచ్, రిలీజ్ ప్రెస్ మీట్, మరొకటి ప్రీ రిలీజ్ ఈవెంట్, మూడు ఆడియో వేడుక, నాలుగు హీరో, హీరోయిన్, దర్శకనిర్మాతల స్పెషల్ ఇంటర్వూస్ ఇంత తతంగం జరిగేది.. ప్రేక్షకులకు సినిమా విడుదల తేదీ.. సినిమా మీద అవగాహనా పెరిగేది.

అయితే ప్రస్తుతం ఓటిటీలలో విడుదలయ్యే చాలా సినిమాలు అసలు ప్రమోషన్ లేకుండానే విడుదలవుతున్నాయి. తాజాగా విడుదలైన సూర్య ఆకాశం నీ హద్దురా విడుదలైన విషయం చాలామందికి తెలియదు. ఇక దీపావళి రోజున నయనతార అమ్మోరు తల్లి సినిమా విడుదలైన విషయం.. ఆ సినిమా రివ్యూ వచ్చేవరకు ప్రేక్షకుడికి తెలియని పరిస్థితి. అందరూ ట్విట్టర్, ఇన్స్టా లలో సినిమాల పబ్లిసిటీ చేస్తుంటే.. చాలామందికి ఆ విషయం చేరడం లేదు. బిసి సెంటర్ ప్రేక్షకుల మాట అటుంచి.. ప్రస్తుతం సిటీ గృహిణులకు ఆ సినిమాల విడుదల విషయం తెలియడం లేదు. సినిమాల ప్రమోషన్స్ చాలా ముఖ్యం. కానీ ఓటిటీలు అవేం అపట్టించుకోవడం లేదు. 

Tags:    

Similar News