ఇక హాట్ గా కాకుండా వళ్లంతా కప్పుకోవాలి!!

సెలబ్రిటీస్ ఎవరైనా ఇతర సిటీస్ కి వెళ్లాలంటే చిట్టిపొట్టి నిక్కర్లతోను, బుల్లి బుల్లి స్లీవ్ లెస్, ఫ్రాక్స్ తోనూ ఎయిర్ పోర్ట్స్ లో దర్శనమిస్తారు. దానితో ఫోటో [more]

Update: 2020-06-12 08:46 GMT

సెలబ్రిటీస్ ఎవరైనా ఇతర సిటీస్ కి వెళ్లాలంటే చిట్టిపొట్టి నిక్కర్లతోను, బుల్లి బుల్లి స్లీవ్ లెస్, ఫ్రాక్స్ తోనూ ఎయిర్ పోర్ట్స్ లో దర్శనమిస్తారు. దానితో ఫోటో గ్రాఫేర్స్ తమ కెమెరాలకు పని కలిపిస్తూ.. సెలబ్రిటీస్ ఎయిర్పోర్ట్ క్లిక్స్ అంటూ సోషల్ మీడియా లో షేర్ చేస్తారు., అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ ఎయిర్ పోర్ట్ లో నిండుగా కాదు.. పీపీఈ సూట్ ధరించి ఎయిర్ పోర్ట్ లో కెమెరాలకు దొరికిపోయింది. ఆమె ఎవరో కాదు.. ఎప్పుడూ వరౌట్స్ చేస్తూ గ్లామర్ గా, హాట్ గా కనబడే రకుల్ ప్రీత్ సింగ్. మాములుగా రకుల్ ప్రీత్ ఎప్పుడు బయటికొచ్చిన చిట్టిపొట్టి నిక్కర్లు వేసుకుని.. హాట్ హాట్ గానే కనబడుతుంది. అందులోనూ బాలీవుడ్ కి చెక్కేశాక రకుల్ మరింత గ్లామర్ షో చేస్తుంది. ఇక ఎయిర్ పోర్ట్ లో అయితే చిన్న చిన్న ఫ్యాన్స్ స్లీవ్ లెస్ టి షార్ట్స్ తో కనబడే రకుల్ ఇప్పుడు వంటి నిండుగా బట్టలు కప్పుకుని ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది.

కరోనా లాక్ డౌన్ ముగియడంతో షూటింగ్స్ అన్ని భషాల్లో నెమ్మదిగా మొదలు అవుతున్నాయి. అయితే రకుల్ ప్రీత్ ఒప్పుకున్న బాలీవుడ్ మూవీ కోసం ముంబై నుండి ఢిల్లీ కి వెళ్ళడానికి ముంబై ఎయిర్ పోర్ట్ కి వచ్చింది రకుల్. ఎప్పుడు హాట్ గా దర్శనమిచ్చే రకుల్ ప్రీత్ ఈసారి కరోనా భయంతో ఒంటినిండుగా దుస్తులు వేసుకుని.. చాలా సేఫ్ గా అరికాలి నుంచి తల వరకు తెల్లటి ప్లాస్టిక్ దుస్తులతో దర్శనమిచ్చింది. ఎంతగా కప్పుకున్నా ఫోటో గ్రాఫర్స్ కంట్లో నుండి తప్పించుకోవడం అసాధ్యం. అందుకే కెమెరా మ్యాన్స్ తమ కెమెరాలతో రకుల్ వెంట పడగా.. అందంగా కనబడలేక.. ఒళ్ళుకప్పుకుని అవస్థలు పడుతున్న రకుల్ కి ఒళ్ళుమండి ఫోటో గ్రాఫర్స్ పై ఎందుకింత టూమచ్ అంటూ విరుచుకుపడింది. మరి కరోనా కారణంగా ఇప్పుడు సెలబ్రిటీస్ అంతా హాట్ గా కాకుండా ఒళ్ళంతా కప్పుకోవాల్సిందే.

Tags:    

Similar News