100 కోట్ల సినిమా… దర్శకుడికిచ్చింది అంతేనా?

ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే.. అది ఎన్టీఆర్ బయోపిక్ గురించే. ఎన్టీఆర్ బయోపిక్ ని కథానాయకుడు, మహానాయకుడు అను [more]

Update: 2019-01-04 03:20 GMT

ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే.. అది ఎన్టీఆర్ బయోపిక్ గురించే. ఎన్టీఆర్ బయోపిక్ ని కథానాయకుడు, మహానాయకుడు అను రెండు పార్ట్ లుగా దర్శకుడు క్రిష్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. అయితే కథానాయకుడిని ఎన్టీఆర్ జేవితంతోను, మహానాయకుడు రాజకీయ జీవితంలోను తెరకెక్కించాడు. ఎన్టీఆర్ నట జీవితం పరిపూర్ణం, కానీ రాజకీయ జీవితం కాంట్రవర్సీలతో నలిగిపోయింది. ఈ రెండు చిత్రాలను క్రిష్ చాలా చక్కగా హ్యాండిల్ చేసినట్లుగా చెబుతున్నారు. చెప్పడం ఏమిటి… విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ అని క్రిష్ పనితనాన్ని చెప్పకనే చెబుతున్నాయి. మొదట్లో ఈ సినిమాని తేజ చేతుల్లో పెట్టినప్పటికీ… ఆ తర్వాత బాలయ్య, క్రిష్ ని నమ్మి ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతను క్రిష్ కి అప్పగించాడు. ఇక ఎన్టీఆర్ గొప్పదనాన్ని క్రిష్ తనదైన శైలిలో చూపిస్తూ ఎన్టీఆర్ బయోపిక్ మీద అంచనాలు పెంచేసాడు. ఆ అంచనాలతోనే ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా 72 కోట్లకి అమ్ముడుపోతే.. డిజిటల్, శాటిలైట్ రైట్స్ అన్ని కలిపి 25 కోట్లకు పైగానే బిజినెస్ చేసింది ఈ కథానాయకుడు సినిమా.

మరి 100 కోట్లకు బిజినెస్ చేసిన ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ అందుకున్నా పారితోషకం ఎంతో తెలుసా.. అక్షరాలా 10 కోట్లు. ఎన్టీఆర్ బయోపిక్ మొదట ఒక పార్ట్ గానే చేద్దామని.. చివరికి రెండు పార్టులుగా సినిమా ని తెరకెక్కించారు. అయితే మొదట్లో ఎన్టీఆర్ బయోపిక్ కి క్రిష్ దర్శకుడిగా అనుకున్నప్పుడే క్రిష్ కి బాలయ్య నిర్మాతగా 10 కోట్ల పారితోషకాన్ని ఫిక్స్ చేసాడట. అలా క్రిష్ కి ఎన్టీఆర్ బయోపిక్ కి గాను 10 కోట్ల పారితోషకం ముట్టింది. అయితే ఈ పది కోట్ల పారితోషకం క్రిష్ దర్శకుడిగా అందుకున్న మొత్తం లో హైయ్యెస్ట్. మరి క్రిష్ కెరీర్ లో దర్శకుడిగా ఎన్టీఆర్ బయోపిక్ కి 10 కోట్ల పారితోషకాన్ని అందుకున్నాడు. కాకపోతే అన్ని కోట్లు లాభాలు తెచ్చే క్రిష్ కి ఈ పది కోట్లుగా అనేది చిన్న అమౌంట్. అయినప్పటికీ.. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ అనుకున్నపుడు దర్శకుడిగా క్రిష్ కి ఫిక్స్ చేసిన రేటు కాబట్టి.. లాభాలొస్తే ఇంకేదన్నా గిఫ్ట్ గా ఇస్తాడేమో చూడాలి.

Tags:    

Similar News