కథానాయకుడు ఆల్ టైం డిజాస్టర్లలో మూడో స్థానం
సంక్రాంతి సీజన్ అయిపోయింది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. థియేటర్స్ లో ఉన్న సినిమాల హడావిడి కూడా కొంచం కొంచం తగ్గుతూ వస్తున్నాయి. ఎన్నో అంచనాలు [more]
సంక్రాంతి సీజన్ అయిపోయింది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. థియేటర్స్ లో ఉన్న సినిమాల హడావిడి కూడా కొంచం కొంచం తగ్గుతూ వస్తున్నాయి. ఎన్నో అంచనాలు [more]
సంక్రాంతి సీజన్ అయిపోయింది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. థియేటర్స్ లో ఉన్న సినిమాల హడావిడి కూడా కొంచం కొంచం తగ్గుతూ వస్తున్నాయి. ఎన్నో అంచనాలు మధ్య రిలీజ్ అయినా ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికిలబడింది. పండగ సెలవుల్లో కొంచం పర్లేదు అనుకున్న ఆ తరువాత పూర్తి గా డల్ అయిపోయింది.
ఈసినిమాను బయర్స్ 70 కోట్లు కు కొంటె అందులో మూడో వంతు కూడా వెనక్కి వచ్చే సూచనలు కనిపించడంలేదు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.20 కోట్ల షేర్ మార్కు దగ్గర ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అంటే దాదాపు 50 కోట్లు నష్టం వచ్చేలా కనిపిస్తుంది. తొలిరోజు పర్లేదు అనిపించుకున్న రెండో రోజు నుండి రిజల్ట్ బెడిసికొట్టింది.
ఇక ఈ వీకెండ్ తరువాత ఈసినిమాను ఎక్కువ థియేటర్స్ నుండి తీసేసే అవకాశముంది. ఇప్పటివరకు టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు తెచ్చి పెట్టిన సినిమా అంటే ‘అజ్ఞాతవాసి’నే. రూ.60 కోట్ల దాకా బయ్యర్లను ముంచింది. ‘స్పైడర్’ సినిమా కూడా దానికి చేరువగా వెళ్లి 55 కోట్ల దాకా నష్టాలు తెచ్చిపెట్టింది. ఆ తరువాత స్తానం లో ఎన్టీఆర్ కథానాయకుడు 50 కోట్ల నష్టాలతో ఆల్ టైం డిజాస్టర్లలో మూడో స్థానానికి స్థిరపడటం ఖాయంగా కనిపిస్తోంది.