బాలయ్యను ఛాలెంజ్ చేసిన ఎన్టీఆర్..!

ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీస్ మధ్య బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ నడుస్తుంది. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ఇంటిని శుభ్రం చేస్తూ [more]

Update: 2020-04-22 02:05 GMT

ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీస్ మధ్య బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ నడుస్తుంది. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ఇంటిని శుభ్రం చేస్తూ విసిరిన ఛాలంజ్ ని రాజమౌళి ఇంటిని శుభ్రం చేస్తూ స్వీకరించడమే కాదు… రాజమౌళి తన ఛాలంజ్ ని ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు విసిరాడు. అయితే రాజమౌళి ఛాలెంజ్ ని స్వీకరించిన ఎన్టీఆర్.. ఇంటిని తడి బట్టతో శుభ్రం చెయ్యడమే కాదు… గిన్నెలు క్లోత్ తో తుడిచి, ఆపై గార్డెన్ ని శుభ్రం చేసాడు.

అంతేనా ఇంట్లోని ప్రేమ ఆప్యాయతలు కాదు.. అందరూ కలిసి పనులు పంచుకుందాం అంటూ ట్వీట్ చేసాడు. ఇక తన ఛాలంజ్ ని బాలా బాబాయి, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేశ్ గారు, కొరటాల శివగారుకి ఈ సవాలు విసురుతున్నాను అంటూ ట్వీట్ వేసాడు. మరి ఎన్టీఆర్ తో కాస్త దూరం మైంటైన్ చేస్తున్న బాల బాబాయ్ ఎన్టీఆర్ ఛాలెంజ్ స్వీకరిస్తాడా అనే మీమాంశ అందరిలోను ఉంది.

Tags:    

Similar News