ఎన్టీఆర్ డ్రైవర్ కి అంత సాలరీనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం #RRR మూవీ షూటింగ్ లో యమ బిజీగా వున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో #RRR సినిమా క్లైమాక్స్ సన్నివేశాల షూట్ కోసం ఎన్టీఆర్ [more]

Update: 2019-12-17 06:00 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం #RRR మూవీ షూటింగ్ లో యమ బిజీగా వున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో #RRR సినిమా క్లైమాక్స్ సన్నివేశాల షూట్ కోసం ఎన్టీఆర్ విశాఖ మన్యానికి వెళ్లడం అక్కడ ఎన్టీఆర్ లుక్ లీకవడం అంతా పెద్ద రచ్చ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన కారు డ్రైవర్ కి ఇచ్చే సాలరీ విషయం హాట్ టాపిక్ గా మరింది. గత కొన్నాళ్లుగా ఎన్టీఆర్ డ్రైవర్ లేనిదే బయటికి అడుగు పెట్టడం లేదు. కారణం ఎన్టీఆర్ ఓన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఓసారి ఎన్టీఆర్ కి మేజర్ యాక్సిడెంట్ జరగడం, తీవ్రగాయాలతో బయట పడడం జరిగింది. తర్వాత తన అన్న జానకి రామ్, తండ్రి హరికృష్ణ లు ఓన్ డ్రైవింగ్ లోనే ప్రాణాలు కోల్పోయారు.

అందుకే ఎన్టీఆర్ తన కారుని నడపడానికి మంచి అనుభవం ఉన్న డ్రైవర్ ని తన కారుకి పెట్టుకున్నాడట. ఎప్పుడో కానీ ఎన్టీఆర్ తన ఓన్ డ్రైవింగ్ తో రోడ్డెక్కకడం లేదని, అంతా డ్రైవర్ చూసుకుంటున్నాడట. తన కోసం పెట్టుకున్న డ్రైవర్ కి మద్యం అలవాటు లేకపోవడమే కాదు.. ఇంతవరకు అతను ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదట. అలాంటి అనుభవం ఉన్న డ్రైవర్ ని పెట్టుకున్న ఎన్టీఆర్ అతనికి నెలకి 80 వేల సాలరీ ఇవ్వడమే కాకుండా పైన 20 వేల వరకు సదుపాయాలను ఇస్తున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయింది.

Tags:    

Similar News