రచ్చ.. రచ్చ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కొట్టిన పోలీసులు..

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానుల సందడి మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో

Update: 2022-05-20 06:28 GMT

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానుల సందడి మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో తారక్ పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. తమ అభిమాన హీరోకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు అర్ధరాత్రి సమయంలో ఆయన ఇంటి దగ్గర హడావుడి చేశారు. ఎన్టీఆర్ ఇంటికి భారీగా అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. ఎన్టీఆర్ ఇంటి ముందే కేక్‌ కట్‌ చేసే సమయంలో అభిమానుల మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. ఫ్యాన్స్ అల్లరి శ్రుతి మించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు అల్లరి ఎక్కువ కావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి అభిమానులను చెదరగొట్టారు. అర్ధరాత్రి అభిమానులు తారక్ ఇంటివద్దకు చేరుకొని బాణాసంచ కాల్చి హడావుడి చేశారు. భారీ కేక్ ను తీసుకుని వచ్చి సందడి సందడిగా గడిపారు. అయితే ఆఖర్లో కొందరి ప్రవర్తన శృతి మించడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఎన్టీఆర్ ఇంటి ముందే కేక్‌ కట్‌ చేసే సమయంలో అభిమానుల మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. ఫ్యాన్స్ అల్లరి శ్రుతి మించడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి అభిమానులను చెదరగొట్టారు.

తారక్ కెరీర్ లో 30వ చిత్రం గా తెరకెక్కుతున్న సినిమా # NTR 30 కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్న సంగతి తెలిసిందే..! తారక్- కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సంధర్భంగా అభిమానులకు కొన్ని గంటల ముందే ఈ వీడియో రావడంతో అభిమానుల సోషల్ మీడియా అకౌంట్స్ ఈ వీడియోతో నిండిపోయాయి. వీడియోలో తారక్ చెప్పే డైలాగ్ యువత ని బాగా ఆకట్టుకుంటోంది. 'అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి దమ్ము ఉండకూడదు అని..అప్పుడు ఆ టైంలో భయానికి తెలియాలి..తాను రావాల్సిన సమయం ఆసన్నమైంది' అనే డైలాగ్ అభిమానులకు తెగ నచ్చేస్తోంది.


Tags:    

Similar News