ఎన్టీఆర్ విలన్ గా ఎన్టీఆర్ ఫ్రెండ్?

ఎన్టీఆర్ కి ఇండస్ట్రీలో దోస్త్ లు బాగా ఎక్కువే. రామ్ చరణ్ తో డీప్ ఫ్రెండ్ షిప్ చేస్తున్న ఎన్టీఆర్ కి మంచు మనోజ్ బాగా ఫ్రెండ్. [more]

Update: 2020-07-05 09:01 GMT

ఎన్టీఆర్ కి ఇండస్ట్రీలో దోస్త్ లు బాగా ఎక్కువే. రామ్ చరణ్ తో డీప్ ఫ్రెండ్ షిప్ చేస్తున్న ఎన్టీఆర్ కి మంచు మనోజ్ బాగా ఫ్రెండ్. రామ్ చరణ్ ఫ్యామిలితో తరుచు కలిసే ఎన్టీఆర్.. మనోజ్ తన ఇంటికి ఏ టైం లో అయినా రానిచ్చేంత మంచి ఫ్రెండ్. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోయినప్పుడు.. మనోజ్ ఓ బౌన్సర్ లా ఎన్టీఆర్ వెన్నంటి ఉన్నాడు. అయితే తాజాగా మంచు మనోజ్ ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడా? అంటే సోషల్ మీడియా అయితే అవుననే అంటుంది. మంచు మోహన్ బాబు వారసత్వంగా సినిమాల్లోకి ఆడుగుపెట్టినా స్టార్ రేంజ్ అందుకోలేక అలాగే ఫ్యామిలీ ఇష్యుస్ తో కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్.. తాజాగా అహం బ్రహ్మస్మి అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ తో ఆసినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే తాజాగా మంచు మనోజ్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా లో విలన్ గ నటించబోతున్నాడని టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది.

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ అవ్వగానే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో మూవీ సెట్స్ మీదకెళుతుంది. ఆ సినిమాలో విలన్ గా రకరకాల పేర్లు వినబడ్డాయి. అందులో బాలీవడో నటుడు సంజయ్ దత్ పేరు బాగా వినబడింది. తాజాగా మంచు మనోజ్ అయితే బావుంటుంది, కొత్తగా ఉంటుంది అని ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి చెప్పినట్టుగా… త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ ఆలోచన బావుంది.. ఇప్పటికే ఆది పినిశెట్టి, నవీన్ చంద్ర లాంటి హీరోలు విలన్ గా అదరగొట్టేసాడు.. అందుకే మనోజ్ ని విలన్ పాత్ర చేస్తావా అని సంప్రదిద్దామనే అనుకుంటున్నారట. అయితే ఈ సినిమా లో మరీ విలనిజంలా నరుకుళ్లు, పొడవడాలు, తలలు లేపెయ్యడాలు ఉండకుండా మనోజ్ పాత్ర స్టైలిష్ విలన్ గా ఎత్తుకు పై ఎత్తు వేసే విలన్ గ ఉండబోతుందట. మరి ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా పొలిటికల్ బబ్యాగ్రౌండ్ లో తెరకెక్కుతుంది. అంటే మనోజ్ ఓ స్టయిలిష్ పొలిటీషియన్ గా కనిపిస్తాడేమో చూడాలి.

Tags:    

Similar News