ఇక్కడనుండి అక్కడ తేలాడు బాలయ్య
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదలకు ముందు నందమూరి బాలకృష్ణ మాములు హంగామా చెయ్యలేదు. తండ్రి బయోపిక్ తెరకెక్కించడం… అందులోను తండ్రి పాత్రను తాను చెయ్యడం అనేది తన [more]
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదలకు ముందు నందమూరి బాలకృష్ణ మాములు హంగామా చెయ్యలేదు. తండ్రి బయోపిక్ తెరకెక్కించడం… అందులోను తండ్రి పాత్రను తాను చెయ్యడం అనేది తన [more]
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదలకు ముందు నందమూరి బాలకృష్ణ మాములు హంగామా చెయ్యలేదు. తండ్రి బయోపిక్ తెరకెక్కించడం… అందులోను తండ్రి పాత్రను తాను చెయ్యడం అనేది తన అదృష్టమని తెగ వాయించేసాడు. మరి ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కూడా భలే అతికాడు. ఎన్టీఆర్ యంగ్ ఏజ్ లుక్ లో బాలయ్య అతక్కపోయినా… నడివయసు పాత్రలో ఎన్టీఆర్ గా బాలయ్య సరిగ్గా సెట్ అయ్యాడు. కృష్ణుడు అవతారంలో ఎన్టీఆర్ ని మళ్ళి చూస్తున్నాము అనిపించింది బాలయ్యని చూసిన వారికీ. ఎన్నో అంచనాల మధ్యన విడుదలైన కథానాయకుడు హిట్ టాక్ ని సొంతం చేసుకుంది కానీ… కలెక్షన్స్ పరంగా 50 కోట్ల నష్టాలను మిగిల్చింది. కథానాయకుడు విడుదలైన రెండుమూడు రోజులు బాలయ్య ఛానల్స్ కి ఇంటర్వూస్ గట్రా ఇస్తూ హడావిడి చేసినా కథానాయకుడు కలెక్షన్స్ దెబ్బకి కనబడకుండా పోయాడు.
అసలు కథానాయకుడు కలెక్షన్స్ విషయంలో బాలయ్య ఎక్కడా స్పందించలేదు.. అసలు మీడియా వారికీ కంటికి కనబడితే ఒట్టు. అయితే మహానాయకుడు షూటింగ్ లో బిజీగా ఉన్నడులే అనుకుంటే.. దర్శకుడు క్రిష్ మాత్రం మణికర్ణికా విషయం మీద కంగనాతో పెట్టుకున్నాడు. మణికర్ణికా విషయంలో క్రిష్ నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. కానీ బాలయ్య ఊసే మీడియాకి దొరకడం లేదు. మధ్యమధ్యలో కథానాయకుడు ప్లాప్ వలన బాలయ్య మహానాయకుడు సెట్స్ లో అసహనం గా ఉంటున్నాడంటూ వార్తలు సోషల్ మీడియాలో ప్రసారమవడం తప్ప. తాజాగా ఇక్కడ మాయమైన బాలకృష్ణ హిందూపురం తెలుగు మహిళల పసుపుకుంకుమ కార్యక్రమంలో తేలాడు.
బాలయ్య నటుడిగానే కాదు.. టిడిపి ఎమ్యెల్యేగా హిందూపురం కి ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టిడిపి తరుపున సీఎం చంద్రబాబు తెలుగు మహిళలు పసుపుకుంకుమ కింద డ్వాక్రా గ్రూప్లో సభ్యులైన మహిళలు 10 వేల రూపాయల చెక్కులు అందజేసే కార్యక్రమాలను నియోజక వర్గాల వారీగా చేపడుతున్నాడు. మరి హిందూపురం ఎమ్యెల్యేగా బాలకృష ఆయన సతీమణి వసుంధర గారితో కలిసి తెలుగు మహిళలు పసుపు కుంకుమ కార్యక్రమంలో మహిళలకు చెక్కులు పంపిణి చేశారు. మరి కథానాయకుడు దెబ్బకి గమ్మునున్న బాలయ్య అలా హిందూపురంలో తేలాడన్నమాట.