RRR కోసం ఎన్టీఆర్ కష్టాలు?
రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడినప్పటికీ… రాజమౌళి మాత్రం ఎడిటింగ్ [more]
రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడినప్పటికీ… రాజమౌళి మాత్రం ఎడిటింగ్ [more]
రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడినప్పటికీ… రాజమౌళి మాత్రం ఎడిటింగ్ అని, గ్రాఫిక్ వర్క్స్ అని ఇంట్లోనే RRR టీం చేత పనులు చేయిస్తున్నాడు. ఇంట్లోనే ఉండి ఎవరి పని వారు చక్కబెట్టేలా రాజమౌళి ప్లాన్ చెయ్యడం, కరోనా కాలాన్ని RRR పబ్లిసిటీ కోసం పక్కాగా వాడడంతో.. రాజమౌళి మీడియా కి దగ్గరగా ఉంటున్నాడు. అయితే ఎన్టీఆర్ రామ్ చరణ్ లు కూడా రాజమౌళి ఏమైనా డబ్బింగ్ పనులు అప్పజెబితే వాటిని తమ ఇంటి నుండే పూర్తి చేస్తున్నారు.
తాజాగా ఎన్టీఆర్ కి RRR కష్టాలు మొదలయ్యాయి అంటున్నారు. RRR సినిమా పాన్ ఇండియా ఫిలిం కాబట్టి.. ఐదు భాషల్లో RRR సినిమా విడుదలవుతుంది. అయితే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పట్టున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఆ మూడు భాషల డబ్బింగ్ ని మాత్రం చెప్పుకుంటున్నారు. ఇప్పటికే హిందీ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అదిరింది. తాజాగా ఎన్టీఆర్ మలయాళం నేర్చుకుంటున్నాడట. RRR మలయాళం వెర్షన్ కి ఎన్టీఆర్ ఓన్ డబ్బింగ్ చెప్పుకునే ప్లాన్ లో భాగంగా మలయాళం నేర్చుకుంటున్నాడట. లాక్ డౌన్ తో ఇంటిపట్టునే ఉంటున్న ఎన్టీఆర్ తిని కూర్చోకుండా మలయాళం భాషనీ సాధన చేస్తున్నాడట.