టైటిల్ విషయంలో నలిగిపోతున్న జక్కన్న?
ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ టైటిల్‌పై చాలా ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఆర్‌ఆర్‌ఆర్ టైటిల్ ని ఉగాది సందర్భంగా ఈ చిత్ర నిర్మాతలు [more]
ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ టైటిల్‌పై చాలా ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఆర్‌ఆర్‌ఆర్ టైటిల్ ని ఉగాది సందర్భంగా ఈ చిత్ర నిర్మాతలు [more]
ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ టైటిల్‌పై చాలా ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఆర్‌ఆర్‌ఆర్ టైటిల్ ని ఉగాది సందర్భంగా ఈ చిత్ర నిర్మాతలు దీనిని ప్రకటించవచ్చు. మార్చ్ లో ఆర్‌ఆర్‌ఆర్ అప్ డేట్ ఉంటుంది అని ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాతలు చెప్పారు. అది రామ్ చరణ్ బర్త్ డే అయినా కావచ్చు. లేదంటే ఉగాది అయినా కావొచ్చు. అయితే ఆర్‌ఆర్‌ఆర్ టైటిల్ విషయంలో రాజమౌళి మరియు చిత్ర బృందం రఘుపతి రాఘవ రాజారామ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పుకార్లు వచ్చాయి. అది సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగినా ఆ టైటిల్ పాన్ ఇండియా లెవెల్ టైటిల్ కాదని జక్కన్న వెనక్కి తగ్గుతున్నాడట. అంత సాఫ్ట్ టైటిల్ పెడితే ఎక్కదని ఆలోచిస్తున్నారనే విషయం ఇంతకూ ముందే మాట్లాడుకున్నాం.
అయితే తాజాగా మరో ట్రేండింగ్ టైటిల్ మీద రాజమౌళి బృందం ఫోకస్ చేసిందనే న్యూస్ ప్రచారంలోకొచ్చింది. అయితే ఆ టైటిల్ ఇప్పటికే మరొకరిచే రిజిస్టర్ కాబడింది. కాబట్టి ఆర్‌ఆర్‌ఆర్ అయితే రాజమౌళి మరియు నిర్మాతలు ఆ టైటిల్ ని రిజిస్టర్ చేయించిన వారిని సంప్రదించినప్పుడు.. వారు రాజమౌళి, డివివి దానయ్యలకు టైటిల్ హక్కులు ఇవ్వడానికి భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారని చెబుతున్నారు. ఆ టైటిల్ మరేదో కాదు.. రానా కోసం తేజ రిజిస్టర్ చేయించిన రామరావణ రాజ్యం. ఈ టైటిల్ ఇంతకుముందే మరో చిన్న నిర్మాత రిజిస్టర్ చేయించగా.. దానిని తేజ దక్కించుకున్నాడట. తాజాగా ఆ టైటిల్ ఆర్‌ఆర్‌ఆర్ కి పర్ఫెక్ట్ అనుకుంటున్నారట రాజమౌళి బృందం. ఇపప్టికే ఈ టైటిల్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉండడంతో.. పాన్ ఇండియా టైటిల్ గా రామ రావణ రాజ్యానికి జక్కన్న బృందం మొగ్గు చూపుతున్నప్పటికీ… హిందీ లో ఈ టైటిల్ ఎలా ఉంటుందో అనే ఆలోచనలో ఉన్నారట. అసలు ఆర్‌ఆర్‌ఆర్ టైటిల్ విషయంలో జక్కన్న మధనపడుతున్నడని… సరిగ్గా ఏది పెట్టాలో తేల్చుకోలేకపోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుండగా.. జక్కన్న ఫ్యాన్స్ మాత్రం ఆర్‌ఆర్‌ఆర్ ఎప్పుడో రాజమౌళి మదిలో ఉంది.. కాబట్టే సినిమాని ఇద్దరు స్టార్స్ తో ఓపెన్ చేసాడంటున్నారు.