బర్త్ డే నేచర్ యోగ

నిన్న రకుల్ ప్రీత్ పుట్టిన రోజునాడు ఆమెకి పలువురు సెలబ్రిటీస్, అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు. అయితే రకుల్ ఈ బర్త్ డే రోజున కూడా [more]

Update: 2019-10-11 06:32 GMT

నిన్న రకుల్ ప్రీత్ పుట్టిన రోజునాడు ఆమెకి పలువురు సెలబ్రిటీస్, అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు. అయితే రకుల్ ఈ బర్త్ డే రోజున కూడా తన బాడీకి ఫుల్ గా పని చెప్పింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అప్పుడప్పుడు యోగాసనాలు వేసే రకుల్ ప్రీత్ ఎప్పుడూ ఫిట్నెస్ కోసం రకరకాల భంగిమలు ట్రై చేస్తుంటుంది. ఫుడ్ కంట్రోల్ ఉండదని చెప్పే రకుల్ ప్రీత్ జిమ్ విషయంలో మాత్రం అస్సలు శ్రద్ద చెయ్యదు. ఒకప్పుడు కాస్త బబ్లీగా అలరించిన రకుల్ ప్రస్తుతం సైజు జీరోలోకి మారిపోయి బాలీవుడ్ భామలను తలపిస్తుంది.

అందరినీ పడేస్తోంది….

తెలుగులో చేతిలో సినిమాలు లేకపోయినా బాలీవుడ్ సినిమాల్లో బీజి అయిన రకుల్ ఎక్కువగా ఫిట్నెస్ మీదే కాన్సంట్రేట్ చేస్తుంది. తాజాగా పుట్టినరోజు రకుల్ నేచర్ యోగాతో బాడీని స్ప్రింగ్ లా బెండ్ చేసిన యోగాసనం చూస్తే అమ్మో రకుల్ యోగా చాలా హాట్ గురు అంటారు. చుట్టూ పచ్చని చెట్లు అద్భుతమైన నేచర్ తో రకుల్ వేసిన యోగాసనం మాత్రం అందరిని అలరిస్తుంది. పుట్టిన రోజు పాపాయి ఇలాంటి యోగాసనంతో అందరిని పడేస్తుంది మరి.

 

Tags:    

Similar News