హమీదా.. అంత ఏడవమాకు తల్లీ

బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు ఏడుస్తూనే ఉంటారు. అంటే ఎక్కువగా భావోద్వేగానికి గురవుతుంటారు. వారే స్క్రీన్ షేర్ ఎక్కువగా పంచుకుంటారు. గత సీజన్లలో [more]

Update: 2021-09-07 08:15 GMT

బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు ఏడుస్తూనే ఉంటారు. అంటే ఎక్కువగా భావోద్వేగానికి గురవుతుంటారు. వారే స్క్రీన్ షేర్ ఎక్కువగా పంచుకుంటారు. గత సీజన్లలో మధుప్రియ, మోనాల్ ల ఏడుపు చూసి వారికి ఓటింగ్ శాతం పెరిగింది. అయితే తాజాగా మొదలయిన బిగ్ బాస్ 5 లో తొలిరోజే హమీదా ఏడుపు మొదలుపెట్టింది. ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియలో తన పేరు చెప్పడంపై హమీదా కళ్లనీళ్లు పెట్టుకుంది. హమీదా సాహసం సేయరా ఢింబకా సినిమాలో నటించింది. కోల్ కత్తాకు చెందిన హమీదా 2013లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. తెలుగు సరిగా రాదు. భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్ సినిమాలో నటించారు. ఆమె నటిగా మాత్రమే కాదు ఇంటీరియర్ డిజైనర్ కూడా. ఈ సీజన్ లో హమీదాను కదిలిస్తేనే ఏడ్చేటట్లే ఉంది. మరి హమీదా తన భావోద్వేగాలతో హౌస్ లో ఎంతకాలం కొనసాగుతారన్నది చూడాలి.

Tags:    

Similar News