ఈ చిన్న సినిమాలను ఎవరు పటించుకోలా!

లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ ఓపెన్ అవ్వలేదు. ఒకవేళ ఓపెన్ అయినా ఇప్పటిలో పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వవు. దాంతో చిన్నసినిమా నిర్మాతలు వడ్డీల భారం [more]

Update: 2020-05-01 10:57 GMT

లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ ఓపెన్ అవ్వలేదు. ఒకవేళ ఓపెన్ అయినా ఇప్పటిలో పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వవు. దాంతో చిన్నసినిమా నిర్మాతలు వడ్డీల భారం తట్టుకోలేక చిన్న సినిమాలు ఓటిటీ వేదిక ద్వారా సినిమాలు విడుదల చేసేస్తున్నారు. తెలుగు అండ్ తమిళ ఇండస్ట్రీస్ నుండి వరస సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ముందుగా తెలుగు లో అమృతరామమ్ సినిమా వస్తే, తమిళం నుంచి ఆర్.కే. నగర్ రిలీజ్ అయ్యాయి. ఇటువంటి చిన్న సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయితేనే ఎవరికి తెలియదు అలాంటిది ఓటిటీ లో రిలీజ్ అయితే ఎవరికి తెలుస్తుంది. కనీసం ప్రచారం కూడా లేదు. అనుకున్నట్టుగానే ఈరెండు సినిమాలు ఆయా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో తుస్సుమన్నాయి. సినిమాలు రిలీజ్ అయ్యాయి అని ప్రత్యేకించి సుబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మాత్రం ఎవరూ ముందుకు రారు. ఆల్రెడీ సుబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు అయితే చూడటానికి ట్రై చేస్తారు.

దాంతో ఓటిటీ సినిమాలు రిలీజ్ అవ్వడం నామ్ కే వాస్తే అనిపిస్తాయంతే. పైగా చిన్న సినిమాలకి పెద్ద అమౌంట్ రాదూ. పాడింగ్ ఆర్టిస్ట్స్ ఉంటె ఓటిటీ సంస్థలు ఎక్కువ డబ్బు ఇచ్చి కొనడానికి ట్రై చేస్తారు. ఇక ఈ లిస్ట్ లో అనుష్క నటించిన నిశబ్దం కూడా ఓటిటీలో రిలీజ్ అవుతుందని బాగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో చూడాలి.

Tags:    

Similar News