ఓటిటి: ఏ క్లాస్ ఓకె… మరి వాళ్ళ సంగతేమిటి?
ప్రస్తుతం ప్రేక్షకులంతా ఓటిటి కి బానిసలవుతున్నారు. లాక్ డౌన్ ప్రభావంతో థియేటర్స్ మొత్తం మూతబడ్డాయి. ఫలితంగా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, [more]
ప్రస్తుతం ప్రేక్షకులంతా ఓటిటి కి బానిసలవుతున్నారు. లాక్ డౌన్ ప్రభావంతో థియేటర్స్ మొత్తం మూతబడ్డాయి. ఫలితంగా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, [more]
ప్రస్తుతం ప్రేక్షకులంతా ఓటిటి కి బానిసలవుతున్నారు. లాక్ డౌన్ ప్రభావంతో థియేటర్స్ మొత్తం మూతబడ్డాయి. ఫలితంగా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్ లు భీబత్సంగా క్రేజ్ లోకోచ్చేసాయి. అయితే ఇప్పుడు అందరికి అమెజాన్ ప్రైమ్ అకౌంట్ కానీ, నెట్ ఫ్లిక్స్ అకౌంట్ కానీ ఉంటుంది అని చెప్పలేము. ఎందుకంటే బిసి సెంటర్స్ లో మాస్ సినిమా థియేటర్స్ లో పడింది అంటే… అక్కడ బాక్సాఫీసు షేక్. కానీ ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయ్ కానీ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్ లాంటి యాప్స్ ఉంటాయా? ప్రస్తుతం చాల సినిమాలు ఓటిటి లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. యూజర్స్ పెంచుకోవడానికి భారీగా ధరలు చెల్లించి మరీ ఓటిటి ప్లేట్ ఫార్మ్స్ వారు సినిమాలను కొనేస్తున్నారు.
అయితే విడుదలైన ఏ సినిమా అయినా మల్టిప్లెక్స్ ఆడియన్స్ దగ్గరకి వెళుతుంది కానీ….. బిసి సెంటర్స్ వద్దకు ఆ సినిమా వెళుతుందా? ఓటిటి లో విడుదలయిన సినిమాలను కొంతమంది డౌన్లోడ్ చేసుకుని తమతమ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తుంటే.. బిసి సెంటర్స్ కి వెళ్తుంది. ఆలాగే విలేజ్ లో పనులకు వెళ్లేవారు ఏ సాయంత్రమొ సరదాగా థియేటర్స్ కి వెళ్లి ఓ మాస్ సినిమా చూసేవారు. కానీ ఇప్పుడు అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ ల హడావిడిలో పల్లెటూరి పనులు చేసుకునేవారు ఎలా సినిమాని వీక్షిస్తారు. ఆనక ఓటిటి ప్రాధాన్యత తెలిసాక వాళ్ళు కూడా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ కి ఎగబడతారేమో చూడాలి. ఏదైనా కరోనా లాక్ డౌన్ వలన అనుకున్నవన్నీ జరక్కపోగా.. ఇప్పుడు మరో ప్రపంచం చూడాల్సి వస్తుంది.