యుద్దానికి సిద్దమవుతున్న పవన్ ఫాన్స్!

మహా శివరాత్రికి భారీ బడ్జెట్ మూవీ ల అప్ డేట్స్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. చిన్న చితక సినిమాల లుక్స్ దగ్గరనుండి.. యంగ్ హీరోల టీజర్స్ [more]

Update: 2021-02-25 15:06 GMT

మహా శివరాత్రికి భారీ బడ్జెట్ మూవీ ల అప్ డేట్స్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. చిన్న చితక సినిమాల లుక్స్ దగ్గరనుండి.. యంగ్ హీరోల టీజర్స్ వరకు మహా శివరాత్రినే టార్గెట్ చేసాయి. అందరిలో ముందుగా పవన్ కళ్యాణ్ – క్రిష్ క్రేజీ ఫిలిం PSPK 27 అప్ డేట్ రాబోతుంది. మహాశివరాత్రి పవన్ ఫాన్స్ కి చాలా స్పెషల్. ఆ రోజు పవన్ ఫాన్స్ కి క్రిష్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం 17 వ శతాబ్దం నాటి కాలాన్ని సృష్టించి ఆ సెట్స్ లో PSPK 27 షూటింగ్ చిత్రీకరణ చేస్తున్న క్రిష్.. పవన్ కళ్యాణ్ PSPK 27 ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ ని మహాశివరాత్రి కానుకగా రివీల్ చెయ్యబోతున్నాడు.

మహాశివరాత్రి రోజు అంటే మార్చ్ 11 న PSPK 27 అప్ డేట్ అనగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రివీల్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించింది టీం. మరి క్రిష్ అండ్ పవన్ PSPK 27 టైటిల్ గా హరిహర వీరమల్లు టైటిల్ బాగా ప్రచారంలో ఉంది. ఆల్మోస్ట్ అదే కన్ఫర్మ్ అని అంటున్నారు. మరి గతంలో PSPK 27 ప్రీ లుక్ లో పవన్ కత్తి పట్టిన బ్యాక్ లుక్ విపరీతంగా వైరలయ్యింది. ఇప్పుడు క్రిష్ మూవీ లో పవన్ హరిహర వీరమల్లుగా ఎలా ఉంటాడో అనే క్యూరియాసిటీ పవన్ ఫాన్స్ లో పెరిగిపోతుంది. మరి మహాశివరాత్రికి కేవలం క్రిష్ లుక్ అండ్ టైటిల్ మాత్రమే కాదు.. అటు హరీష్ శంకర్ ఇటు వకీల్ సాబ్ టీం కూడా పవన్ ఫాన్స్ కి సర్ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారు. దానితో పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో పవన్ మూవీ అప్ డేట్స్ ని ట్రేండింగ్ లో ఉంచేందుకు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News