ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా.. కొట్టామా? లేదా?
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినా ఆయన హీరోయిజానికి ఎలాంటి ఢోకా లేదు. రాజకీయాల్లోకి వెళ్ళకముందు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉందొ.. వెళ్లొచ్చాక కూడా అలానే ఉంది. [more]
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినా ఆయన హీరోయిజానికి ఎలాంటి ఢోకా లేదు. రాజకీయాల్లోకి వెళ్ళకముందు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉందొ.. వెళ్లొచ్చాక కూడా అలానే ఉంది. [more]
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినా ఆయన హీరోయిజానికి ఎలాంటి ఢోకా లేదు. రాజకీయాల్లోకి వెళ్ళకముందు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉందొ.. వెళ్లొచ్చాక కూడా అలానే ఉంది. రాజకీయాల్లో నీతో నడవలెం కానీ.. సినిమాల్లో మాత్రం నీతోనే ఉంటామన్నారు. అందుకే రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు భారీ గ్యాప్ ఇచ్చినా పవన్ ఫాన్స్ పవన్ ని గుండెల్లో పెట్టుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళాడు ఇక క్రేజ్ పోగొట్టుకుంటాడు అనుకుంటే.. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు సరికదా పవన్ ఫాన్స్ మరింతగా పవన్ ని ఆరాధిస్తున్నారు. అందుకు నిదర్శనమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లో ఉండడం.
పవన్ కళ్యాణ్ బర్త్ డే కి ఇంకా నెలన్నర టైం ఉంది. సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ బర్త్ డే ని పురస్కరించుకుని ఆయన ఫాన్స్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవన్ అంటూ హాష్ టాగ్ తో ట్విట్టర్, పేస్ బుక్, ఇన్స్టా లో హోరెత్తిస్తున్నారు. పవన్ బర్త్ డే హాష్ టాగ్ 24 గంటల్లో ఏకంగా 27.3 మిలియన్ల ట్వీట్స్ తో రికార్డులు సృష్టించారు పవన్ కళ్యాణ్ ఫాన్స్. ఇప్పుడు కరోనా కారణంగా హీరోల ఫాన్స్ మొత్తం సోషల్ మీడియాలో తమ హీరోల పుట్టిన రోజు ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ముందు నుండి తమ హీరోలకు అడ్వాన్స్ విషెస్ చెబుతూ ఇలా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. మే లో ఎన్టీఆర్ పుట్టిన రోజుకి ఎన్టీఆర్ ఫాన్స్ కూడా ఇలానే అడ్వాన్స్ విషెస్ చెబుతూ 24 గంటల్లో ఎన్టీఆర్ బర్త్ డే హాష్ టాగ్ తో 21 మిలియన్ ట్వీట్లతో రికార్డు నెలకొల్పగా…ఇప్పుడు పవన్ ఫాన్స్ ఆ రికార్డుని తిరగరాసారు.