పవన్ ఫాన్స్ వల్ల ఇబ్బందులు పడ్డ అంటున్న యాంకర్?

పవన్ కళ్యాణ్ ఫాన్స్ అనే కాదు.. ఏ హీరో ఫాన్స్ అయినా తమ హీరోని తక్కువ చేసి మట్లాడినా, తక్కువ చేసి చూసినా అస్సలూరుకోరు. సోషల్ మీడియాలో [more]

Update: 2020-08-21 02:43 GMT

పవన్ కళ్యాణ్ ఫాన్స్ అనే కాదు.. ఏ హీరో ఫాన్స్ అయినా తమ హీరోని తక్కువ చేసి మట్లాడినా, తక్కువ చేసి చూసినా అస్సలూరుకోరు. సోషల్ మీడియాలో ట్రోల్ చెయ్యడం, బయటెక్కడైనా కనబడితే పరుగులు పెట్టించడం చేస్తుంటారు. ఓకొనొక టైం లో అనసూయ పవన్ కళ్యాణ్ ఫాన్స్ వలన నానా ఇబ్బందులు పడింది. అదే విషయాన్నీ తాజాగా అలీతో జాలిగా ప్రోగ్రాం లో పాల్గొన్నప్పుడు చెప్పింది. ప్రస్తుతం అలీతో అనసూయ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ప్రోమోలో అనసూయ చాలా విషయాలను పంచుకుంది.

అనసూయ కి అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ తో పార్టీ సాంగ్ లో స్టెప్స్ వేసే అవకాశం ఇవ్వగా. దానికి అనుసయా ఒప్పుకోలేదట. కారణం అప్పటికి అనసూయ ఆరు నెలలు గర్భవతట. అందుకే ఒప్పుకోలేదట. అయితే అనసూయ అత్తారింటికి దారేది సినిమా విడుదలైన కొత్తల్లోనే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాక తాను అత్తారింటికి దారేది సినిమాలో పార్టీ సాంగ్ చెయ్యడం పోవడమే మంచిది అని… ఎదుకంటే ఆ సాంగ్ చేస్తే గుంపులో గోవిందంలా కలిసిపోయేదాన్ని అని అనడంతో.. పవన్ కళ్యాణ్ ఫాన్స్ తనని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారని.. తెలియక చేసిన ఓ చిన్న కామెంట్ వలన అప్పట్లో పవన్ ఫాన్స్ వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యా అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.

Tags:    

Similar News