బాబోయ్ పవన్.. ఫాన్స్ కి టెంక్షన్?

పవన్ కళ్యాణ్ ఫిట్ నెస్ పై సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఫిట్ నెస్ గాలికొదిలేశారు. మరి మళ్ళి సినిమాల్లోకి [more]

Update: 2020-10-21 09:04 GMT

పవన్ కళ్యాణ్ ఫిట్ నెస్ పై సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఫిట్ నెస్ గాలికొదిలేశారు. మరి మళ్ళి సినిమాల్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఫిట్ నెస్ పై శ్రద్ద పెట్టేస్తాడు.. ఇక హీరోయిజం చూపిస్తాడనుకుంటే.. పవన్ మాత్రం తన ఏజ్ కి సరిపోయే మిడిల్ ఏజ్ పాత్రలనే చెయ్యాలని డిసైడ్ అయ్యాడని… కాబట్టి ఫిట్ నెస్ గురించి పవన్ పట్టించుకోడానే న్యూస్ మొదలైంది. తాను ఎలా ఉన్నానో అలానే సినిమాల్లో నటిస్తానని తన దర్శకులకు చెప్పినట్టుగా వార్తలొచ్చాయి. ఇక కరోనా తో ఇంటికి, చేనుకి పరిమితమైన పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షతో గెడ్డం పెంచి గెటప్ మార్చేసి ఓ యోగిలా తయారయ్యాడు.

అయితే సినిమాల విషయం వచ్చేసరికి పవన్ స్టైలిష్ గా కనబడతాడు.. ఫిట్ నెస్ ఎలా ఉంటే ఎందుకులే అని పవన్ ఫాన్స్ సరిపెట్టుకున్నారు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ లుక్ చూసిన వారికీ కళ్ళు తిరుగుతున్నాయి. ఆయన ఫాన్స్ లో ఒణుకు మొదలైంది. వచ్చే వారంలో వకీల్ సాబ్ షూటింగ్ కి పవన్ జాయిన్ అవుతాడని అనుకుంటున్న సమయంలో పవన్ ఇలాంటి గెటప్ లో ఇలా డల్ లుక్ లో కనిపించడం, చూసిన ఫాన్స్ షాకవుతున్నారు. పవన్ కళ్యాణ్ గెడ్డం బాగా పెంచేసి ఓ బాబా లా తయారయ్యాడు. ఫేస్ లో గ్లో లేదు. చాలా నీరసమైన ఫేస్ తో పవన్ లుక్ చూసిన ఫాన్స్ టెంక్షన్ పడుతున్నారు. మరి పవన్ లుక్ చేంజ్ ఎప్పుడు ఉంటుందో అని ఫాన్స్ తెగ వర్రీ అవుతున్నారు.

Tags:    

Similar News