పవన్ రెడీనే కానీ..

పవన్ కళ్యాణ్ ఈమధ్యన కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వలన మరికొన్ని రోజుల పాటు రెస్ట్ లో ఉండాలని పవన్ కళ్యాణ్ హెల్త్ [more]

Update: 2021-05-30 11:43 GMT

పవన్ కళ్యాణ్ ఈమధ్యన కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వలన మరికొన్ని రోజుల పాటు రెస్ట్ లో ఉండాలని పవన్ కళ్యాణ్ హెల్త్ అప్ డేట్ రాగానే.. పవన్ ఫాన్స్, పవన్ తో సినిమాలు చేస్తున్న దర్శకనిర్మాతలు కంగారు పడ్డారు. ఆయన ఇప్పుడప్పుడే సినిమా షూటింగ్స్ లో పాల్గొనరేమో అని. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమాల షూటింగ్స్ కోసం రెడీ కాబోతున్నారట. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఏకే రీమేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కరోనా సెకండ్ వేవ్ కాస్త కంట్రోల్ కాగానే కొత్త షెడ్యూల్ ప్లాన్ చెయ్యమని చెప్పినట్లుగా తెలుస్తుంది. 
ఏప్రిల్ లో క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు ఓ షెడ్యూల్ ఫినిష్ చేసినా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నారనగానే పవన్ ఫాన్స్ లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. కారణం ఆయన పూర్తిగా కోలుకున్నారని. ఇక ఈ మధ్యనే పవన్ లుక్స్, గెటప్స్ వివరాలను ఆ సినిమా కాస్ట్యూమ్స్ డిజైనర్ ఐశ్వర్య బయట పెట్టిన విషయం తెలిసిందే. త్వరలోనే మొదలు కాబోయే కొత్త షెడ్యూల్ లో గెస్ట్ రోల్ చెయ్యబోప్తున్న బాలీవుడ్ భామ జాక్విలిన్, విలన్ రోల్ చెయ్యబోతున్న అర్జున్ రాంపాల్ కూడా పాల్గొంటారు. రాజీవన్ డిజైన్ చేసిన మొఘల్ కాలంనాటి సెట్లు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News