పవన్ కళ్యాణ్ నిజమైన హీరో అంటున్న హీరోయిన్?

అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పేరు టెహ్చుకున్న లావణ్య త్రిపాఠికి కెరీర్ లో చెప్పుకోదగిన చిత్రాలున్నప్పటికీ… ఆమెకి సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. గ్లామర్ [more]

Update: 2020-05-20 04:19 GMT

అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పేరు టెహ్చుకున్న లావణ్య త్రిపాఠికి కెరీర్ లో చెప్పుకోదగిన చిత్రాలున్నప్పటికీ… ఆమెకి సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. గ్లామర్ షో చేసినా అవకాశాలు సన్నగిల్లాయి. తాజాగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంట్లో గడుపుతున్న లావణ్య త్రిపాఠి అభిమానులల్తో చిట్ చాట్ చేసింది. శ్రీదేవి, మాధురి దీక్షిత్ లు స్ఫూర్తి తోనే తానూ సినిమాల్లోకి హీరోయిన్ గా వచ్చా అని… ఇక అల్లు అర్జున్ పుష్ప ఫస్ట్ లుక్ పై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితె.. పుష్ప ఫస్ట్ లుక్ చంపేసింది.. అల్లు అర్జున్ ఖాతాలో మరో సూపర్ హిట్ ఖాయం అని చెప్పింది.

ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే.. పవన్ కళ్యాణ్ రియల్ హీరో అంటుంది. అసమానతలకు ఎదురు నిలబడి పోరాటం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే ఆయన నిజమైన హీరో అన్నది. ఇక రామ్ చరణ్ సినిమాల్లో కెల్లా అయన నటించిన రంగస్థలం సినిమా సూపర్ అంటుంది. అలాగే లాక్ డౌన్ లో వండడం, తినడం, సైలెంట్ గా ఉండడం నేర్చుకున్న అంటుంది. అంతే కాకుండా కరోనా లక్డౌన్ లో బ్యాట్మెంటిన్ ని పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా అంటుంది. ఇక మీ బ్యూటీ సీక్రెట్ ఏమిటి అని అడిగితె.. మన మదిలో ఏముంటుందో.. మన మొహం లోను అదే కనబడితే.. అదే నిజమైన అందమంటుంది ఈ బ్యూటీ లావణ్య త్రిపాఠి.

Tags:    

Similar News