పాకిస్తాన్, బంగాళాదేశ్‌లో కూడా పవన్ కళ్యాణ్ మ్యానియా..

పవన్ కళ్యాణ్ మ్యానియా ఇండియాలోనే కాదు పాకిస్తాన్, బంగాళాదేశ్‌లో కూడా కనిపిస్తుంది. బ్రో సినిమా..

Update: 2023-08-30 11:30 GMT

ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan kalyan), సాయిధ‌ర‌మ్‌ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ చిత్రం 'బ్రో' (Bro). థియేటర్స్ లో మంచి విజయమే అందుకున్న ఈ చిత్రం.. ఆగష్టు 25 నుంచి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో.. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో ప్రసారం అవుతుంది. దీంతో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ వస్తుంది. ఆగష్టు 21-27 తేదీల మధ్య టాప్ 10 స్ట్రీమింగ్ లిస్ట్ ని నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్ చేసింది.

ఈ లిస్ట్ లో పవన్ బ్రో మూవీ నెంబర్ ప్లేస్ లో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌ ఇండియాలో అత్యధిక స్ట్రీమింగ్ సాధించి నెంబర్ వన్ గా నిలిచింది. అయితే పవన్ మ్యానియా ఇక్కడితో ఆగలేదు. మన పక్క దేశాలు అయిన పాకిస్తాన్ (Pakistan), బాంగ్లాదేశ్‌ (Bangladesh) నెట్‌ఫ్లిక్స్‌ టాప్ 10 లిస్ట్ లో ఈ చిత్రం 8వ స్థానం నిలిచి సంచలనం సృష్టించింది. అంతేకాదు నాన్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ స్ట్రీమింగ్ లిస్ట్ లో కూడా ఈ మూవీ 7వ స్థానాన్ని దక్కించుకొని టాప్ 10లో నిలిచింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించిన లిస్ట్ 21 నుంచి 27 డేట్స్ మధ్యన. బ్రో మూవీ రిలీజ్ అయ్యింది 25వ తేదీన. అంటే కేవలం రెండు రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ సునామీ సృష్టించాడు. దీంతో పవన్ అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ తమిళ చిత్రం ‘వినోదయ సిత్తం’కి రీమేక్ గా తెరకెక్కింది. సముద్రఖని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు.
కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా వారియర్, సుబ్బరాజు, వెన్నల కిశోర్, బ్రహ్మానందం, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 130 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.


Tags:    

Similar News