స్టార్స్ అందుకున్న పవన్ క్రిస్మస్ గిఫ్ట్స్

ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ తన సన్నిహితులకు, స్నేహితులకి క్రిస్మస్ గిఫ్ట్స్ పంపడమే. తన స్నేహితులైన మహేష్, రానా, నితిన్, బండ్ల [more]

Update: 2020-12-25 06:23 GMT

ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ తన సన్నిహితులకు, స్నేహితులకి క్రిస్మస్ గిఫ్ట్స్ పంపడమే. తన స్నేహితులైన మహేష్, రానా, నితిన్, బండ్ల గణేష్ లాంటి ప్రముఖులకు పవన్ తన తరుపున క్రిస్మస్ గిఫ్ట్స్ పంపి అందరికి షాకిచ్చాడు. అయితే ప్రత్యేకించి పవన్ క్రిస్మస్ సెలెబ్రేట్ చేసుకోవడానికి కారణం ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా. పవన్ కళ్యాణ్ మూడో భార్య కోసం క్రిస్మస్ సెలెబ్రేషన్స్ మొదలు పెట్టాడు. అంతేనా ఇప్పుడు ఇండస్ట్రీ లో ప్రముఖులకు, తనకు దగ్గర స్నేహితులకి క్రిస్మస్ గిఫ్ట్స్ పంపిస్తున్నాడు. మహేష్ దగ్గర మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ రానా, నితిన్, బండ్ల గణేష్ లతో సహా మరికొంతమంది సన్నిహితులకు ఈ క్రిస్మస్ గిఫ్ట్స్ పంపించాడు.

మరి పవన్ కళ్యాణ్ అలా క్రిస్మస్ గిఫ్ట్స్ పంపగా ఆ గిఫ్ట్స్ అందుకున్న నమ్రత మహేష్ నూతన దంపతులైన పవన్, అన్నాకి మంచి జరగాలని కోరుకుంటే.. బండ్ల గణేష్ అయితే మీ ప్రేమకు నేనెప్పుడూ బానిస నే బాస్ నువ్వే నా దేవుడివి అంటూ ట్వీట్ చేసాడు. ఇక నితిన్ అయితే థాంక్స్ అన్నా అంటే.. రానా మీ ప్రేమకి, అభిమానానికి ధన్యవాదాలు అంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాడు. మరి గతంలోనూ పవన్ కళ్యాణ్ తన మామిడి తోటలో కాచిన కాయలు నితిన్ వంటి సన్నిహితులు పంపినట్లుగానే.. ఇప్పుడు కొత్తగా పవన్ క్రిస్మస్ కానుకలు పంపుతున్నాడు.

Tags:    

Similar News