అన్నపూర్ణ స్టూడియోస్ లో పవన్, బాలయ్య ఫ్యాన్స్ సందడి.. నేడే షూటింగ్
ఇద్దరూ వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారు కావడంతో.. ఈ ఎపిసోడ్ లో బాలయ్య పవన్ కల్యాణ్ ను..
ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న అన్ స్టాపబుల్ 2 షో.. సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. ఈ సారి కేవలం సినిమాలకు సంబంధించిన ప్రముఖులే కాకుండా.. పలువురు రాజకీయ నేతలను షో కు తీసుకొచ్చారు. బాలయ్య హోస్ట్ గా ప్రారంభమైన ఈ సీజన్ తొలి ఎపిసోడ్ కు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ లు గెస్టులుగా వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యంగ్ హీరోలతో పాటు పలువురు సినీ నిర్మాతలు, అగ్రదర్శకులు, ఇటీవల సీనియర్ నటీమణులు జయసుధ, జయప్రద లతో పాటు యంగ్ హీరోయిన్ రాశిఖన్నా ఈ టాక్ షో కి విచ్చేశారు.
ఇక ప్రభాస్ - గోపీచంద్ ల ఎపిసోడ్ ఈ నెల 30న స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తుండగా.. మరో పవర్ ప్యాక్డ్ అప్డేట్ ఇచ్చింది ఆహా. ఈ నెల 27న పవన్ కల్యాణ్ .. అన్ స్టాపబుల్ 2 షో కి రానున్నారంటూ హింట్స్ ఇవ్వడంతో.. నేడు బాలయ్య, పవన్ కల్యాణ్ ల అభిమానులు భారీగా అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకున్నారు. ఇద్దరూ వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారు కావడంతో.. ఈ ఎపిసోడ్ లో బాలయ్య పవన్ కల్యాణ్ ను రాజకీయపరంగా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారోనని ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభమవ్వకుండానే.. ఈ పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఒక్క ఎపిసోడ్ తో ఆహా రేంజ్.. ఊహించని స్థాయికి వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించి తదుపరి అప్డేట్ కోసం పవన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.