ఇటలీలో జరిగే వరుణ్-లావణ్య పెళ్ళికి.. పవన్ కళ్యాణ్ వెళ్తాడా..?

ఇటలీలో జరిగే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడా..?

Update: 2023-10-27 05:19 GMT

టాలీవుడ్ ఆన్ స్క్రీన్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మరో వారం రోజుల్లో మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ ఏడాది జూన్ లో నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట.. నవంబర్ 1న ఏడడుగులు వేయబోతున్నారని సమాచారం. ఇక ఈ పెళ్లిని విదేశాల్లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటలీలోని టుస్కానీ నగరం ఈ వివాహానికి వేదిక కాబోతుంది. ఈ వెడ్డింగ్ కి మెగా, అల్లు కుటుంబసభ్యులు, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే హాజరుకానున్నారు.

టుస్కానీలో ఈ నెల అక్టోబర్ 30 నుంచి మొదలు కానున్న ఈ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇతర మెగా హీరోలంతా తమ షూటింగ్స్ కి బ్రేక్ చెప్పేశారట. ఈ రెండు రోజుల్లో వీరంతా ఒక్కొక్కరిగా ఇటలీ బయలుదేరనున్నారని సమాచారం. అయితే ఇక్కడ అందరిలో ఒక సందేహం నెలకుంది. ఈ పెళ్ళికి పవన్ కళ్యాణ్ కూడా వెళ్తాడా..? ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హోరు కొనసాగుతుంది.
తెలంగాణలో కూడా జనసేన పోటీ చేయనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్ నెలాఖరులో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ దేశం దాటి వెళ్లి కొత్త జంటని ఆశీర్వదిస్తాడా..? అనే సందేహం కొందరి మెగా అభిమానుల్లో కలుగుతుంది. అయితే కొంతమంది అభిమానుల చెబుతున్న మాట ఏంటంటే.. నవంబర్ 1 పెళ్లి రోజున ఒక అతిథిగా వెళ్లి కొత్త జంటని ఆశీర్వదించి పవన్ వెంటనే తిరిగి వచ్చేస్తాడని చెబుతున్నారు. మరి పవన్ ఏం చేస్తాడో చూడాలి.
కాగా ఇటలీలో ఈ పెళ్లి వేడుక మూడు రోజులు పాటు జరగనుంది. అక్టోబర్ 30న మొదలయ్యి నవంబర్ 1తో పూర్తి కానున్నాయి. అనంతరం నవంబర్ 5న హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో బంధుమిత్రులు, స్నేహితులు, సినీ సెలబ్రిటీస్, మరికొంతమంది ప్రముఖులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారట.


Tags:    

Similar News