ఇలా చూస్తే కిక్కేముంది?
పవన్ కళ్యాణ్ న్యూ లుక్ చూస్తుంటే పవన్ ఫ్యాన్స్ కి టెన్షన్ పట్టుకుంది. పవన్ కళ్యాణ్ – వేణు శ్రీరామ్ కాంబో వకీల్ సాబ్ కోసం లాయర్ [more]
పవన్ కళ్యాణ్ న్యూ లుక్ చూస్తుంటే పవన్ ఫ్యాన్స్ కి టెన్షన్ పట్టుకుంది. పవన్ కళ్యాణ్ – వేణు శ్రీరామ్ కాంబో వకీల్ సాబ్ కోసం లాయర్ [more]
పవన్ కళ్యాణ్ న్యూ లుక్ చూస్తుంటే పవన్ ఫ్యాన్స్ కి టెన్షన్ పట్టుకుంది. పవన్ కళ్యాణ్ – వేణు శ్రీరామ్ కాంబో వకీల్ సాబ్ కోసం లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ లుక్ ఎలా ఉన్నప్పటికీ… క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫిట్ గా నీట్ గా అందంగా కనబడతాడనే టాక్ నడిచింది. ఎందుకంటే క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ జిమ్ లో కసరత్తులు గట్రా చేసి.. న్యూ లుక్ లోకి మారడమే కాకుండా కొత్తగా స్టైలిష్ గా తయారవుతాడనుకుంటే.. ప్రస్తుతం పవన్ మరింత బొద్దుగా అవుట్ అఫ్ ఫిట్నెస్ తో కనబడుతూ పవన్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టేస్తున్నాడు. సినిమాల్లోకి వచ్చాక రాజకీయాలకోసమే టైం వెచ్చిస్తున్న పవన్ కళ్యాణ్ కి జిమ్ కెళ్లే తీరిక లేదు. అందుకే బరువు పెడుతున్నాడు.
తాజాగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా మీద ప్రెస్ మీట్ లో మాట్లాడిన పవన్ లుక్ దగ్గరగా చూస్తే.. బుగ్గలు బాగా వచ్చేసి.. ఫేస్ కూడా బొద్దుగా మారి.. పవన్ తన స్టైలిష్ లుక్ ని రాజకీయాలతో పోగొట్టుకున్నాడనిపిస్తుంది. మళ్ళీ ఎంతగా ట్రై చేసినా పవన్ గతంలో ఉన్న లుక్ మాదిరి తిరిగి కాలేడు అంటున్నారు చాలామంది. ఇది వింటున్న పవన్ ఫ్యాన్స్ బాగా బెంగ పెట్టు కుంటున్నారు . పవన్ సినిమాల్లో స్టయిల్ నచ్చే భారీ అభిమానగణం తయారైంది. ఇక రాజకీయాల్లో పవన్ క్లాస్, లుక్ అన్ని నచ్చక అక్కడ సపోర్ట్ చెయ్యలేదు కానీ.. మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ అనగానే చాలా స్టైలిష్ పవన్ ని చూద్దామనుకుంటే… పవన్ మాత్రం ఎప్పటిలాగేఅంటే పొలిటికల్ లుక్ లోనే కనిపిస్తూ ఫ్యాన్స్ ని అడుగడుగునా డిస్పాయింట్ చేస్తున్నాడు.