పూరి, త్రివిక్రమ్ తో పక్కనా…. పవన్?

పవన్ కళ్యాణ్ సైలెంట్ గా పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ ని చుట్టేస్తున్నాడు. వకీల్ సాబ్ ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ అయినా.. పవన్ మాత్రం [more]

Update: 2020-03-07 06:16 GMT

పవన్ కళ్యాణ్ సైలెంట్ గా పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ ని చుట్టేస్తున్నాడు. వకీల్ సాబ్ ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ అయినా.. పవన్ మాత్రం సినిమాలపై పెదవి విప్పడం లేదు. వకీల్ సాబ్ అప్పుడే క్లైమాక్స్ షూట్ కి వెళ్ళింది అని.. మార్చ్ చివరికల్లా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి.. ఏప్రిల్ లో పోస్ట్ ప్రొడక్షన్ కోసం కేటాయిస్తాడట దర్శకుడు వేణు శ్రీరామ్. ఇక వకీల్ సాబ్ తో పాటుగా క్రిష్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాన్ని హరీష్ తో కమిట్ అవడమే కాదు.. అధికారిక ప్రకటన కూడా ఇప్పించాడు. అయితే వరస గా మూడు సినిమాలు లైన్ లో పెట్టిన పవన్, స్నేహితుడు త్రివిక్రమ్ కి కమిట్ అవ్వకపోవడం మాత్రం అందరికి విడ్డూరంగానే ఉంది.

త్రివిక్రం కూడా ఏం పట్టనట్టుగా RRR తో బిజీగా వున్న ఎన్టీఆర్ ని పట్టుకున్నాడు కానీ పవన్ కోసం కథ తయారు చెయ్యడం లేదు. కానీ తాజాగా పవన్ హరీష్ శంకర్ తర్వాత ఓ పొలిటికల్ బ్యాగ్రౌండ్ సినిమాని పూరి జగన్నాధ్ తో ప్లాన్ చేసాడని, పూరి విజయ్ దేవరకొండ తో తెరకెక్కించే సినిమా తర్వాత పవన్ తో పక్కా అంటూ ఓ న్యూస్ ప్రచారంలోకొచ్చింది. అలాగే పూరి తర్వాత త్రివిక్రం తో పవన్ సినిమా ఉంటుంది అని.. పవన్ కళ్యాణ్ పూరి, త్రివిక్రమ్ సినిమాలను కూడా సెట్ చేసుకున్నాడని, కాకపోతే అంతా సైలెంట్ మోడ్ లోనే పవన్ చక్కబెడుతున్నాడనే టాక్ వినబడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ షూటింగ్ ని గ్యాప్ ఇవ్వకుండా చక్కబెట్టినా.. ప్రమోషన్స్ కి మాత్రం ఏదో ఒక ఇంటర్వ్యూ తో సరిపెట్టేలా నిర్మాతలతో సినిమాల డీల్ మట్లాడుకుంటున్నాడట. ఇక పవన్ సినిమా అంటే క్రేజ్ ఏ లెక్కలో ఉంటుందో తెలిసిన నిర్మాతలు కూడా పవన్ తో సర్దుకుపోవడానికే రెడీ అవుతున్నారట.

Tags:    

Similar News