2020 లో రెండు.. 2021 లో రెండు
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మదిలో మెదులుతున్న సినిమాల విషయం అది. ఈ ఏడాది మొదట్లో మొదలెట్టిన పింక్ రీమేక్ వకీల్ సాబ్.. మే లో విడుదలకు డేట్ [more]
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మదిలో మెదులుతున్న సినిమాల విషయం అది. ఈ ఏడాది మొదట్లో మొదలెట్టిన పింక్ రీమేక్ వకీల్ సాబ్.. మే లో విడుదలకు డేట్ [more]
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మదిలో మెదులుతున్న సినిమాల విషయం అది. ఈ ఏడాది మొదట్లో మొదలెట్టిన పింక్ రీమేక్ వకీల్ సాబ్.. మే లో విడుదలకు డేట్ ఇచ్చేసారు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ రోల్ అంతగా లేదు కాబట్టి.. త్వరగా షూటింగ్ ఫినిష్ చేసేసాడు. ఇక క్రిష్ తోనూ పవన్ కళ్యాణ్ మరో సినిమా వేగవంతంగా పూర్తి చేస్తున్నాడు. చారిత్రాత్మక చిత్రమైనా.. క్రిష్ మేకింగ్ స్పీడు తో క్రిష్ తో చేసే సినిమాని కూడా పవన్ ఈ ఏడాది చివర్లోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చినా తేవొచ్చనే టాక్ నడుస్తుంది. క్రిష్ సినిమా చిత్రీకరణ ఎంత వేగవంతంగా ఉంటుందో ఆయన గత సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. సో దసరా నుండి.. డిసెంబర్ లోపు పవన్ ఎప్పుడైనా రావొచ్చు. ఇక మూడో సినిమా హారిష్ శంకర్ సినిమాని ఈ ఏడాదే సెట్స్ మీదకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు పవన్.
ఇప్పటికే రాజకీయాలు, సినిమా షూటింగ్ లంటూ క్షణం తీరిక లేని పవన్ హరీష్ సినిమాని చాలా స్పీడుగా చుట్టేసి విచ్చే ఏడాది ఏప్రిల్ లోనే విడుదల చేసేట్టుగా ప్లాన్ చేస్తున్నాడట. మరోపక్క పూరి, త్రివిక్రమ్ సినిమాలను పవన్ లైన్ లో పెట్టినట్లుగా న్యూస్ నడుస్తుంది. ఇక పూరి మేకింగ్ స్టయిల్, ఆయన స్పీడు ఎవరికీ రాదు.. ఇక పూరి జగన్నాధ్ తో చేసే సినిమాని 2021 ఏడాది చివరికల్లా పవన్ పూర్తి చెయ్యాలనే డెడ్ లైన్ పెట్టుకున్నాడని అంటున్నారు. మరోపక్క త్రివిక్రమ్ సినిమా కూడా లైన్ లో ఉంది. మరి ఆ సినిమా విషయంలో పవన్ స్పీడెంతో చూడాలి. ప్రస్తుతం అయితే ఈఏడాది వేణు శ్రీరామ్ వకీల్ సాబ్, క్రిష్ సినిమాల్తో పవన్ ప్రేక్షకుల ముందుకు రావడం మాత్రం పక్కా