పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మరో లీక్
ప్రస్తుతం రాజకీయాలను పక్కనబెట్టి పవన్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. వకీల్ సాబ్ షూటింగ్ ముగియకముందే సాగర్ చంద్ర తో అయ్యప్పమ్ కోషియమ్ మొదలెట్టేసాడు. రానా దగ్గుబాటితో మల్టీస్టార్ [more]
ప్రస్తుతం రాజకీయాలను పక్కనబెట్టి పవన్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. వకీల్ సాబ్ షూటింగ్ ముగియకముందే సాగర్ చంద్ర తో అయ్యప్పమ్ కోషియమ్ మొదలెట్టేసాడు. రానా దగ్గుబాటితో మల్టీస్టార్ [more]
ప్రస్తుతం రాజకీయాలను పక్కనబెట్టి పవన్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. వకీల్ సాబ్ షూటింగ్ ముగియకముందే సాగర్ చంద్ర తో అయ్యప్పమ్ కోషియమ్ మొదలెట్టేసాడు. రానా దగ్గుబాటితో మల్టీస్టార్ గా అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్ చేస్తున్నాడు పవన్. తాజాగా ఆ సినిమా లాంచ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ లీకులపై పవన్ అసంతృప్తిగా ఉన్నట్లుగా ఫిలింసర్కిల్స్ చక్కర్లు కొడుతున్న న్యూస్. పవన్ కళ్యాణ్ – వేణు శ్రీరామ్ కాంబోలో జనవరిలోనే మొదలయిన వకీల్ సాబ్ సినిమా ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రీకరణలో ఉంది. అయితే వకీల్ సాబ్ మొదలైనప్పటినుండి ఆ సినిమా లుక్స్ సోషల్ మీడియాలో లీకవుతూనే ఉన్నాయి. పవన్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ వదలకుండానే వకీల్ సాబ్ గా పవన్ లుక్ సోషల్ మీడియాలో లీకైంది.
ఫస్ట్ లుక్ విషయంలోనే ఇలాంటి లీకులపై పవన్ కాస్త చిరాకు పడ్డాడని న్యూస్ ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతున సెట్స్ నుండి మరో పిక్ లీకైంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవన్ తన భార్య శృతి హాసన్ తో ఉన్న రొమాంటిక్ లుక్ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ కలిసి ఉన్న వకీల్ సాబ్ లీక్డ్ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మరి వకీల్ సాబ్ టీజర్ గాని మరేదన్నా కానీ వదలకపోతే ఇలాంటి లీకులు మరెన్ని వస్తాయో అంటూ పవన్ ఫాన్స్ తలపట్టుకుంటున్నారు.