మే 15 వకీల్ సాబ్ పక్కా.. ఇది ఫిక్స్?

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ అన్ని బంద్ అయ్యాయి. ఎప్పుడు ఏ సినిమా విడుదలవుతుందో ఎవ్వరికి తెలియని పరిస్థితి. ఇప్పటికే డేట్స్ ఇచ్చిన వారు [more]

Update: 2020-03-18 06:40 GMT

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ అన్ని బంద్ అయ్యాయి. ఎప్పుడు ఏ సినిమా విడుదలవుతుందో ఎవ్వరికి తెలియని పరిస్థితి. ఇప్పటికే డేట్స్ ఇచ్చిన వారు కూడా వెనక్కి తగ్గుతున్నారు. అయితే ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాని కూడా దిల్ రాజు మే 15 నుండి వాయిదా వేసే అవకాశం ఉంది.. కరోనా పరిస్థితుల వలన సినిమా షూటింగ్ తో పాటు మిగతా పనులు కూడా నిలిచిపోయిన కారణంగా వకీల్ సాబ్ వాయిదా పక్కా అంటూ పవన్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఈ కరోనా కారణంగా రెండు మూడు వారాలైనా సినిమా వాయిదా పడుతుంది అని అనుకుంటున్నారు.

అయితే దిల్ రాజు మాత్రం అనుకున్న డేట్ కె వకీల్ సాబ్ ని దింపాలని చూస్తున్నాడట. దానికోసం చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడట. షూటింగ్ కాస్త లెట్ గా మొదలైనా.. ఉన్న కాస్త సన్నివేశాలను ఆఘమేఘాల మీద చిత్రీకరించి.. పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లాలని దర్శకుడు వేణు శ్రీరామ్ కి ఆర్డర్ వేసాడట. ఇండోర్ లో చెయ్యాల్సిన షూటింగ్ మొత్తం రాత్రనక పగలనక లాగించేస్తే.. సినిమాని అనుకున్న టైం కి పూర్తి చెయ్యొచ్చని.. అలాగే పబ్లిసిటీకి పెద్దగా టైం లేకపోయినా.. పవన్ క్రేజ్ తో సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చెయ్యొచ్చనే ప్లాన్ తో దిల్ రాజు ఉన్నాడట. ఎలాగూ దిల్ రాజు ఈమధ్యన పబ్లిసిటీ మీద ఫోకస్ తగ్గించాడు. ఖర్చెందుకు అనుకుంటున్నాడో లేదా మారేదన్నానో కానీ.. ప్రస్తుతం వకీల్ సాబ్ పబ్లిసిటి విషయాన్నీ దిల్ రాజు లెక్కలోకి తీసుకోవడం లేదనే టాక్ వినబడుతుంది.

Tags:    

Similar News