ఉగాది రోజు ఊపొచ్చింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యానియా శని, ఆదివారాల్లో వకీల్ సాబ్ థియేటర్స్ దగ్గర బాగా నడిచింది. మూడేళ్లు సినిమాలకు గ్యాప్ రావడం, సిల్వర్ స్క్రీన్ మీద [more]

Update: 2021-04-14 06:53 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మ్యానియా శని, ఆదివారాల్లో వకీల్ సాబ్ థియేటర్స్ దగ్గర బాగా నడిచింది. మూడేళ్లు సినిమాలకు గ్యాప్ రావడం, సిల్వర్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ పెరఫార్మెన్స్ కి మొహం వాచిపోయిన ఫాన్స్ వకీల్ సాబ్ ని కలెక్షన్స్ విషయంలో అందలం ఎక్కిస్తారనే అనుకున్నారు. మరి శని – ఆదివారాలు వీకెండ్ కాబట్టి వకీల్ సాబ్ వసూళ్ల మోత మోగింది. కానీ మండే వకీల్ సాబ్ కలెక్షన్స్ డల్ అయ్యాయి. మండే వర్కింగ్ డే, అలాగే వకీల్ సాబ్ ఓటిటిలో వచ్చేస్తుంది అనే రూమర్స్, కరోనా అన్ని వకీల్ సాబ్ వసూళ్లు డల్ అవ్వడానికి కారణమయ్యాయి. అయితే మండే కాస్త డల్ అయినా వకీల్ సాబ్.. ఉగాది రోజున పుంజుకుంది.

వకీల్ సాబ్ ఓటిటిలో ఇప్పుడే రిలీజ్ చెయ్యడం లేదు.. అవన్నీ రూమర్స్ అంటూ టీం ఇచ్చిన క్లారిటీ, ఉగాది పండగ సెలవు, ఫాన్స్ లో జోష్ అన్ని కలిపి వకీల్ సాబ్ వసూళ్లు పుంజుకున్నాయి. వకీల్ సాబ్ సినిమా కలెక్షన్స్ బయటికి రాకపోవడంతో కాస్త గందరగోళం గానే ఉన్నా.. థియేటర్స్ దగ్గర ప్రేక్షకులను బట్టి బాక్సాఫీసు కలెక్షన్స్ ఇలా ఉంటున్నాయని ఓ ఐడియా కి వచ్చేస్తున్నారు. అదే కలెక్షన్స్ అధికారికంగా బయటికి వస్తే అప్పుడు ఎక్కడ, ఏ రోజు డల్ అయ్యింది, ఏ రోజు కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయో ఈజీగా తెలిసిపోయేవి. కానీ ఏం చేస్తాం వకీల్ సాబ్ కలెక్షన్స్ విషయంలో పవన్ చాలా స్ట్రీట్ గా ఉన్నారు. అందుకే ఇలా.

Tags:    

Similar News