ఆడాళ్లకి అన్యాయమా.. అన్నోళ్లకి… ఈ పాట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దిల్ రాజు – వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా ఫస్ట్ లుక్ తోనే విపరీతమైన అంచనాలు [more]

Update: 2020-03-08 07:02 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దిల్ రాజు – వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా ఫస్ట్ లుక్ తోనే విపరీతమైన అంచనాలు పెరిగేలా చేసింది. ఇక ఫస్ట్ లుక్ లో కేవలం పవన్ కళ్యాణ్ ని మాత్రమే పోస్టర్ లో చూపించారు. అదే బాలీవుడ్ పింక్ లో అమితాబ్ తో పాటుగా హీరోయిన్స్ లుక్ ని ఫస్ట్ లుక్ లోను, తమిళనాట పింక్ రీమేక్ లో అజిత్ తో పాటుగా హీరోయిన్స్ లుక్స్ ని విడుదల చేస్తే ఇక్కడ తెలుగులో కేవలం పవన్ లుక్ నే విడుదలచేసి మహిళలను కించపరిచారని అన్నారు. పవన్ కళ్యాణ్ పక్షపాతి అన్నట్టుగా మాట్లాడారు. ఎందుకంటే పవన్ కి క్రేజ్ ఉంది..అందుకే పవన్ లుక్ లో హీరోయిన్స్ ని చూపించలేదు అంటూ ఫైర్ అయ్యారు. కానీ మహిళా దినోత్సవం రోజున వకీల్ సాబ్ టీం మగువా మగువా అనే సాంగ్ లిరిక్ ని విడుదల చేసింది. ఆ సాంగ్ లిరిక్ లో ఆడవాళ్ళ గొప్పదనాన్ని, మహిళలు చేసిన సాహసాలను వాళ్ళ ఫొటోస్ ప్లే చేస్తూ మరీ మహిళలను కీర్తిస్తూ ఆ సాంగ్ ని మహిళలకే అంకితమిచ్చారు. మరి ఫస్ట్ లుక్ లో హీరోయిన్స్ ఫొటోస్ వెయ్యలేదు అంటూ పవన్ మీద పడి ఏడ్చిన వారికీ.. ఈ మగువా మగువా సాంగ్ చెంప పెట్టులాంటిది అంటూ పవన్ ఫ్యాన్స్ పవన్ ని తక్కువ చేసి మట్లాడినా వారికీ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు.

వకీల్ సాబ్… మగువా.. మగువా.. సాంగ్ లిరిక్స్:
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా…
మగువా మగువా నీ సహనానికి సరిహద్దు లు కలవా…
అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు, ఇంటా బయట ఆ ఆ …
అలుపని రవ్వంత… అననే అనవంత… వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా…
స.. గ.మ.ప.గ.మ.సా….. గ. మ.ప.మా. గ…. గ. మ.ప.మా.గ… గ.మ.ప.గ.సా…
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా… ఆఆ…
మగువా మగువా నీ సహనానికి సరిహద్దు లు కలవా…
నీ కాటుక కనులు విప్పారకపోతే…
ఈ భూమికి తెలవారదుగా…
నీ గాజుల చేయి కదలాడకపోతే…
ఏ మనుగడ కొనసాగదుగా…
ప్రతి వరసలోను ప్రేమగా. అల్లుకున్న బంధమా… అంతులేని నీ శ్రమా అంచనాలకందునా…
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా… నీవులేని జగతి లో దీపమే వెలుగునా…
నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడే గా…
ఎందరి పెదవులలో ఈ చిరునవ్వున్నా… ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా…
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా…
మగువా మగువా నీ సహనానికి సరిహద్దు లు కలవా….

Tags:    

Similar News