పవన్ పారితోషికం లెక్కలు

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఆయనతో సినిమా చెయ్యాలనే పట్టుదలతో నిర్మాత దిల్ రాజు తిరిగి తిరిగి చివరికి త్రివిక్రమ్ సాయంతో పింక్ రీమేక్ [more]

Update: 2021-04-23 06:33 GMT

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఆయనతో సినిమా చెయ్యాలనే పట్టుదలతో నిర్మాత దిల్ రాజు తిరిగి తిరిగి చివరికి త్రివిక్రమ్ సాయంతో పింక్ రీమేక్ కి ఒప్పించి.. మళ్ళీ సినిమాల్లోకి గ్రాండ్ గా కం బ్యాక్ ఇచ్చేలా చేసాడు దిల్ రాజు. మరి ఆ కం బ్యాక్ అలాంటి ఇలాంటి కం బ్యాక్ కాదు.. కాస్ట్లీ కం బ్యాక్. పవన్ కళ్యాణ్ ని వకీల్ సాబ్ సినిమా చెయ్యడానికి గాను 50 కోట్ల భారీ పారితోషికం ఇచ్చి మరీ పవన్ ని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు దిల్ రాజు. పవన్ కళ్యాణ్ కి చార్టెడ్ ఫ్లైట్స్ అవీ ఇవి అబ్బో దిల్ రాజు పవన్ కళ్యాణ్ ని ఓ దేవుడిలా పూజించేశాడు. దిల్ రాజు పారితోషికంతో పవన్ నెక్స్ట్ నిర్మాతలు కూడా పవన్ కి అంతే ఇవ్వాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు ఆ 50 కోట్లు మాత్రమే కాదు.. అదనంగా మరో 15 కోట్లు దిల్ రాజు పవన్ కి ముట్టజెప్పాడట. ఎందుకంటే వకీల్ సాబ్ కి లాభాలొచ్చాయనే సంతోషంలో మరో 15 కోట్లు పవన్ కి ఇచ్చాడట దిల్ రాజు. ఇందులో నిజమెంతుందో కానీ.. వకీల్ సాబ్ కి పవన్ పారితోషకం లెక్కలు చూస్తే నిజంగా షాకవ్వాల్సిందే. అసలు వకీల్ సాబ్ కి ఎంత లాభాలొచ్చాయి. ఓవర్సీస్ లో నష్టాలన్నారు. ఇప్పడు లాభాల్లో వాటలంటున్నారు. వినడానికి కాస్త కన్ఫ్యూజన్ గానే ఉన్నా.. టాలీవుడ్ లో ఇలా ఓ సినిమాకి హీరో పారితోషికం 65 కోట్లు అంటే మాములు విషయం కాదు.
పవన్ ని ఇలా చూస్తే మిగతా హీరోలకి కుళ్ళుకుంటారేమో. ఏదైనా వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ అవడానికి పవన్ కళ్యాణ్ కీలకం కాబట్టే దిల్ రాజు.. పవన్ కి ఎంతిచ్చినా తక్కువే అని ఫీలయ్యాడేమో.. అందుకే ఎడా పెడా పవన్ కి లెక్కలుగట్టి మరీ ఇలా చేసుకుంటాడంటున్నారు పవన్ ఫాన్స్.

Tags:    

Similar News