మామతో సినిమా అనుకుంటే అల్లుడు తగిలాడు!

పవన్ కళ్యాణ్ రాజీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే అంటే దాదాపు మూడేళ్ళ క్రితమే పవన్ కళ్యణ్ ని కలిసిన దర్శకుడు దేవా కట్ట.. పవన్ కళ్యాణ్ కి [more]

;

Update: 2021-02-17 10:13 GMT
Sai Tej Pawan Kalyan
  • whatsapp icon

పవన్ కళ్యాణ్ రాజీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే అంటే దాదాపు మూడేళ్ళ క్రితమే పవన్ కళ్యణ్ ని కలిసిన దర్శకుడు దేవా కట్ట.. పవన్ కళ్యాణ్ కి ఓ స్క్రిప్ట్ వినిపించాడు. సబ్జెక్టు బాగా నచ్చిన పవన్ కళ్యాణ్ కి దేవా కట్ట సినిమా చేద్దామని ఉన్నప్పటికీ.. రాజకీయ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలాంటి అంటే ఈ తరహా సబ్జెక్టు నేను చెయ్యడం కరెక్ట్ కాదు.. అని ఫీలయిన పవన్ కళ్యాణ్.. దేవా కట్ట కథని వదలడానికి ఇష్టం లేక.. ఆ కథని సాయి ధరమ్ తేజ్ తో చెయ్యమని దేవా కట్టాని రిక్వెస్ట్ చేసాడు.
అదే దేవా కట్టా – సాయి తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమా. పొలిటికల్ ఇష్యుస్ – సామజిక అంశాలు ఎక్కువగా ఉండి.. కథ మొత్తం సీరియస్ మోడ్ లో నడిచే కథ రిపబ్లిక్. మాములుగా లవర్ బాయ్ కేరెక్టర్స్ తో, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ తో సర్వైవ్ అయ్యిపోతున్న సాయి తేజ్ కి ఇది నిజంగా తల మీద భారమనే చెప్పుకోవాలి. మామ పవన్ కళ్యాణ్ మాట కాదనలేక చేసినట్టే ఈ సినిమా. రిపబ్లిక్ అనే పెద్ద కథని తన మీద మొయ్యాల్సి వస్తుంది. మరి ఈ రిపబ్లిక్ సాయి తేజ్ కి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుందో చూడాలి.

Tags:    

Similar News