అలా వదిలేస్తే ఎలా!!
ప్రస్తుతం ఓ మాదిరి, చిన్న సినిమాలన్నీ ఓటిటి వైపుకు మళ్లుతున్నాయి. నిన్నటివరకు ససేమిరా అన్న దర్శకులు, హీరోయిన్స్ కూడా నేడు ఓటిటి వైపే చూసుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి [more]
ప్రస్తుతం ఓ మాదిరి, చిన్న సినిమాలన్నీ ఓటిటి వైపుకు మళ్లుతున్నాయి. నిన్నటివరకు ససేమిరా అన్న దర్శకులు, హీరోయిన్స్ కూడా నేడు ఓటిటి వైపే చూసుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి [more]
ప్రస్తుతం ఓ మాదిరి, చిన్న సినిమాలన్నీ ఓటిటి వైపుకు మళ్లుతున్నాయి. నిన్నటివరకు ససేమిరా అన్న దర్శకులు, హీరోయిన్స్ కూడా నేడు ఓటిటి వైపే చూసుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అలానే ఉంది. అన్ని అవ్వజేసుకుని విడుదల కోసం వెయిట్ చేసి చేసి చివరికి ఓటిటి కి వదులుతున్నారు. తాజాగా కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ నిన్న శుక్రవారం ఓటిటి అమెజాన్ ప్రైమ్ నుండి విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు కీర్తి సురేష్ ఈ సినిమాని బాగానే ప్రమోట్ చేసింది. అయితే ప్రస్తుతము అన్ని రెడీ చేసుకుని కూర్చున్న నిర్మాతలను ఓటిటి వైపు లాగుతున్నారు. అయితే ఓటిటిలో విడుదల చేసే మీడియం సినిమాల విషయంలో దర్శకులు కూడా కాస్త తగ్గుతున్నారు. ఎందుకంటే థియేటర్స్ లో ఆడుతుందో లేదో అనే మీమాంసలో ఓటిటికి ఇచ్చేస్తున్నారు. తాజాగా పెంగ్విన్ అందుకే ఓటిటి కి ఇచ్చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సినిమాలకు కథ, కథనాలు బలంగా ఉండాలి. కానీ పెంగ్విన్ ఫస్ట్ ని బాగా హ్యాండిల్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ ని గాలికొదిలేసాడు.
ఇలాంటి సినిమాని మహానటి కీర్తి ఎలా ఒప్పుకుందో. సినిమాలో విషయం లేకనే సినిమాని ఓటిటి కి ఇచ్చేశారనిపిస్తుంది. అయితే ఓటిటి వాళ్ళుకూడా నిర్మాతలను బుట్టలో వెయ్యడానికి గాను… కాస్త ఎక్కువ మొత్తం ముట్టజెబుతున్నారు. అందులో భాగంగానే కీర్తి సురేష్ పెంగ్విన్ కి 7.5 కోట్ల బరి డీల్ నిర్మాతలకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. విడుదలకు ముందు హడావిడి చేసిన కీర్తి సురేష్ అండ్ టీం.. విడుదలై యావరేజ్ టాక్ వచ్చాక మాయమయ్యారు. అంటే థియేటర్స్ లో విడుదలైతే ఏ సక్సెస్ మీట్, ఏ హిట్ ప్రెస్ మీతో పెట్టేవారు. కానీ అమెజాన్ లో విడుదలైంది కాబట్టి.. ఇక ఎలాంటి హడావిడి చెయ్యక్కర్లేదు అనుకున్నానేమో మూవీ టీం. అందుకే అమ్మేసి చేతులు దులిపేసుకున్నాను. అయినా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వాళ్ళకి ఇలానే జరగాలిలే.