మధురై నగరానికి చెందిన ఒక న్యాయవాది తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు పెట్టారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వ్యాధులతో పోల్చినందుకు పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఉదయనిధి స్టాలిన్ పై విరుచుకుపడ్డారు. ఇది తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే నేతలకు మింగుడుపడలేదు. అందుకే పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టాలని నిర్ణయించుకున్నారు.
వంజినాథన్ అనే న్యాయవాది పవన్ కళ్యాణ్ పై మధురై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి స్టాలిన్‌పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ వివాదానికి, ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని, అయినా పవన్ విమర్శలు చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.