పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ పై కేసు నమోదు
పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతికి మించి ప్రేక్షకులకు అనుమతి ఇచ్చినందున కేసు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్ పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న యూసఫ్ గూడ పొలీస్ బెటాలియన్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగింది.
నిబంధనలను ఉల్లంఘించి....
ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే పోలీసులు కేవలం ఐదు వేల మందికి మాత్రమే అనుమతిచ్చారు. పాస్ లు ద్వారా లోపలకి అనుమతించాలని సూచించారు. కానీ పది వేల మంది హాజరయినట్లు పోలీసులు తెలిపారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. శ్రేయాస్ మీడియా ఈ ఈవెంట్ ను నిర్వహించింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు ఈవెంట్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. వీడియో ఫుటేజీని కూడా పోలీసులు సేకరించారు. శ్రేయాస్ మీడియా పరిమితికి మించి పదివేల పాస్ లను విక్రయించిందని పోలీసులు చెబుతున్నారు.