డ్యూయెల్ రోల్ లో ఎలా కనబడతావ్ పూజమ్మా?

పూజ హెగ్డే లక్కుతో అవకాశాలు పట్టేస్తుంది. అందంతో అదరగొట్టేస్తుంది. కానీ నటన పరంగా పూజ హెగ్డే చాలా వీక్ అనేది ఆమె నటించిన సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. [more]

Update: 2020-09-29 04:48 GMT

పూజ హెగ్డే లక్కుతో అవకాశాలు పట్టేస్తుంది. అందంతో అదరగొట్టేస్తుంది. కానీ నటన పరంగా పూజ హెగ్డే చాలా వీక్ అనేది ఆమె నటించిన సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. అయినప్పటికీ స్టార్ హీరోలంతా పూజ గ్లామర్ చుట్టూనే తిరుగుతూన్నారు. ప్రస్తుతం ప్రభాస్  తో రాధేశ్యాం తో పాన్ ఇండియా మూవీ చేస్తున్న పూజ హెగ్డే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో నటిస్తుంది. అయితే పూజ హెగ్డే రాధాకృష్ణ డైరెక్ట చేస్తున్న రాధేశ్యాం మూవీ లో డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా టాక్. ఫస్ట్ లుక్ లో చాలా రొమాంటిక్ గా ప్రభాస్ ని హగ్ చేసుకుని కనిపించిన పూజ హెగ్డే కవలలుగా రాధేశ్యాం లో డబుల్ రోల్స్ చేస్తున్నట్టు గా ఫిలింనగర్ టాక్.

ఒక పాత్రలో చాలా సంప్రదాయంగా ట్రెడిషనల్ గా కనిపించబోతుంటే మరో పాత్ర మాత్రం గ్లామర్ గా ఫాస్ట్ కల్చర్ ఉన్న అమ్మాయిలా కనిపించబోతున్నదనేది లేటెస్ట్ న్యూస్. మరి  ట్రెడిషనల్ గాను, గ్లామర్ గాను పూజ హెగ్డే డ్యూయెల్ రోల్ లో ఎలా కనిపించబోతుందో అనేది అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. ప్రభాస్ – పూజ ల రొమాంటిక్ సీన్స్ తో పాటుగా రాధేశ్యాం క్లైమాక్స్ సినిమాకే హైలెట్ అంటూ ప్రచారం జరుగుతుంది.  కరోనా లాక్ డౌన్ తో వాయిదా పడిన రాధేశ్యాం షూటింగ్ కొన్ని మాత్రం సెట్స్ వేసి లాగించేస్తున్న దర్శకుడు కొన్ని సన్నివేశాల కోసం త్వరలోనే ఇటలీలో రాధేశ్యాం షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.

Tags:    

Similar News