పూజ బోర్ అంటున్నారు.. ఆలోచించండి!!

టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోలకు ఒక్క పూజ హెగ్డే తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు. కాజల్, సమంత, తమన్నా లాంటి వాళ్ళు సీనియర్స్ అవడం [more]

Update: 2020-10-06 06:59 GMT

టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోలకు ఒక్క పూజ హెగ్డే తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు. కాజల్, సమంత, తమన్నా లాంటి వాళ్ళు సీనియర్స్ అవడం కొత్త హీరోయిన్స్ ఇంకా ఎంట్రీ ఇవ్వకపోవడంతో గత రెండు మూడేళ్లుగా పూజ హెగ్డే నే స్టార్ హీరోలను చుట్టేస్తోంది. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా ఎవరికైనా పూజ నే హీరోయిన్. ఈమధ్యన ఏ సినిమా చూసినా ఆమె తప్ప మరొకరు కనిపించడం లేదు. మధ్యలో రష్మిక వచ్చినా పూజ హెగ్డే హైట్ ముందు రష్మిక కొద్దిగా వెనకబడింది. అయితే తాజాగా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో తెరక్కబోయే సినిమాలో హీరోయిన్ ఎంపిక జరుగుతుంది అని.. హీరోయిన్స్ ని ఎక్కువగా రిపీట్ చేసే త్రివిక్రమ్ చూపు మళ్ళీ పూజ పైనే పడిందనే టాక్ మొదలైంది.

అరవింద సామెత, అలా వైకుంఠపురములో సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ – అల్లు అర్జున్ లకు పూజ హెగ్డే నే రిపీట్ చేసాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ కి మరో హీరోయిన్ ఛాయస్ లేకపోవడంతో పూజ హెగ్డే నే మళ్ళి ఎన్టీఆర్ కోసం సెట్ చేయబోతున్నాడని అంటున్నారు. కానీ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం పూజ వద్దు బోర్ అంటున్నారట. త్రివిక్రమ్ కి ఈ మేర రిక్వెస్ట్ లు కూడా పెడుతున్నారట ఎన్టీఆర్ ఫాన్స్. మరి త్రివిక్రమ్ పూజ హెగ్డే ని మెయిన్ లీడ్ కి తీసుకుని సెకండ్ హీరోయిన్ గా మరో సౌత్ భామ అమృత అయ్యర్ తీసుకోబోతున్నట్టుగా టాక్ ఉంది. అమృత్ అయ్యర్ ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, రెడ్ సినిమాల్లో నటించింది. ఇక త్రివిక్రమ్ ఎన్టీఆర్ ఫాన్స్ రిక్వెస్ట్ పట్టించుకుంటాడో లేదంటే ఎప్పటిలాగే పూజ హెగ్డే నే రిపీట్ చేస్తాడో చూద్దాం.

Tags:    

Similar News