పూజ కోరికల చిట్టా
సినిమాలో నటించే నటీనటులకు కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. ఫలానా పాత్ర చేయాలనీ, ఫలాన కథలో నటించాలని ఇలా చాలా కోరికలు ఉంటాయి. అలాగే పూజా హెగ్డే [more]
సినిమాలో నటించే నటీనటులకు కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. ఫలానా పాత్ర చేయాలనీ, ఫలాన కథలో నటించాలని ఇలా చాలా కోరికలు ఉంటాయి. అలాగే పూజా హెగ్డే [more]
సినిమాలో నటించే నటీనటులకు కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. ఫలానా పాత్ర చేయాలనీ, ఫలాన కథలో నటించాలని ఇలా చాలా కోరికలు ఉంటాయి. అలాగే పూజా హెగ్డే కి కూడా ఆశలు, ఆలోచనలు కొన్ని ఉన్నాయంట. దీని గురించి రీసెంట్ గా పూజా మాట్లాడుతూ..” నేను చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి. అవ్వని రాస్తే ఓ పుస్తకం సరిపోదు. నేను రకరకాల పాత్రల్లో ఊహించుకుంటాను. మరి అవ్వని కుదురుతాయో లేవో తెలియదు కానీ చేయాలనే కోరిక మాత్రం ఉంది.
ప్రేమ కథలు కావాలి…
నేను అనుకునే వాటిలో కొన్ని అయినా తీరితే బాగుంటది అని ఆలోచిస్తున్నా. నాకు ఇప్పుడున్న వయసుకి ప్రేమ కథలు చేయాలనీ ఉంది. కరెక్ట్ గా నాకు ఇదే టైంకి ప్రభాస్ సినిమా అవకాశం వచ్చింది. ఇందులో నా పాత్ర హైలైట్ గా ఉంటుంది. అలానే యువరాణిలా, క్రీడాకారిణిలా, మాస్ లేడీలా, పొగరుబోతు అమ్మాయిలా..ఇలా చాలా చేయాలనీ అనుకుంటున్నా మరి అవి ఎప్పుడు తీరుతాయో చూడాలి” అంటుంది పూజా. ఇక పూజ ప్రస్తుతం ప్రభాస్ సినిమాతో పాటు అఖిల్ , అల్లు అర్జున్ సినిమాలో నటిస్తుంది.