‘జిగేలురాణి’ గెటప్ లో పూజా హెగ్డే
నటిగా సూపర్ ఫామ్ లో ఉన్న పూజా హెగ్డే ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంది. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న టైములో ఐటెం సాంగ్ చేసింది. కాకపోతే [more]
నటిగా సూపర్ ఫామ్ లో ఉన్న పూజా హెగ్డే ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంది. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న టైములో ఐటెం సాంగ్ చేసింది. కాకపోతే [more]
నటిగా సూపర్ ఫామ్ లో ఉన్న పూజా హెగ్డే ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంది. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న టైములో ఐటెం సాంగ్ చేసింది. కాకపోతే ఆ సాంగ్ కి విపరీతం మైన క్రేజ్ వచ్చిందనుకోండి. రంగస్థలం సినిమాలో పూజా స్పెషల్ సాంగ్ ‘జిల్ జిల్ జిల్ జిగేలురాణి’ తో మాస్ ప్రేక్షకులని మెప్పించింది. ఆ సాంగ్ కి ఎంత క్రేజ్ వచ్చిందో అందులో డాన్స్ వేసిన పూజా కి కూడా అంతే క్రేజ్ వచ్చింది. ఆ ఒక్క పాటతో మాస్ ప్రేక్షకుల్లో పూజా ఫాలోయింగ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఆమె ఆ సాంగ్ లో వేసిన పల్లెటూరి గెటప్ ఇప్పటికి అందరికి గుర్తే.
అంతలా ఎట్రాక్ట్ చేసిన ఆ గెటప్ మరోసారి పూజా వేసుకుంది. అయితే ఈసారి హరీష్ శంకర్ సినిమా ‘వాల్మీకి’ లో వేసింది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు హరీశ్. మాస్ ప్రేక్షకులకి దగ్గరగా ఉండే ఆ గెటప్ మంచి మాస్ మసాలా సాంగ్ కోసమా లేదా ఏదైనా సీన్ కోసమా అనేది తెలియదు. ఇక ఈచిత్రంలో వరుణ్ తేజ్, ఆధర్వ మురళీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 13 న ఈమూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.