టాలీవుడ్ లో రెండు.. బాలీవుడ్ లో నాలుగా?

టాలీవుడ్ లో సమంత, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, తమన్నా లాంటోళ్ళు సీనియర్స్ అయ్యి. స్టార్ హీరోలకు సైడ్ అయిపోగా.. ప్రస్తుతం టాప్ వన్ లో పూజ [more]

Update: 2020-03-19 06:45 GMT

టాలీవుడ్ లో సమంత, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, తమన్నా లాంటోళ్ళు సీనియర్స్ అయ్యి. స్టార్ హీరోలకు సైడ్ అయిపోగా.. ప్రస్తుతం టాప్ వన్ లో పూజ హెగ్డే అదరగొట్టేస్తుంది. స్టార్ హీరోల ఏకైక ఛాయస్ పూజ హెగ్డే తప్ప మరెవరూ కనిపించడం లేదు. వరస హిట్స్ తో పిచ్చెక్కిస్తున్న పూజ హెగ్డే ఇప్పుడు సినిమాకొచ్చి కోటిన్నర నుండి రెండు కోట్లు డిమాండ్ చేసి మరీ తీసుకుపోతుంది. డిమాండ్ ఉంది.. క్రేజ్ ఉంది కాబట్టి పారితోషకం భారీగా పట్టికెలుతుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు… అమ్మడు వ్యవహారం బాలీవుడ్ లో యమా రంజుగా ఉంది.

అమ్మడుకి బాలీవుడ్ లోను వరస ఆఫర్స్ తగులుతున్నాయి. అక్షయ్ కుమర్, సల్మాన్ ఖాన్ ఒకటేమిటి రెండు మూడు సినిమాలను పూజ చేజిక్కించుకుంది బాలీవుడ్ లో. అమ్మడు గ్లామర్ మీద బాలీవుడ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగింది. గతంలో బాలీవుడ్ మెట్లెక్కిన సక్సెస్ కాక తిరిగొచ్చిన ఈ బ్యూటీ మల్లి బాలీవుడ్ లో పాగా వెయ్యడానికి రెడీ అవడమే కాదు.. తెలుగులో 2 కోట్లు పారితోషకం అందుకుంటే.. బాలీవుడ్ లో దానికి డబుల్ అందుకుంటుందని టాక్. బాలీవుడ్ లో పూజ తాజాగా ఒప్పుకున్న సినిమాలకు 4 కోట్లు తీసుకుంటుంది. అమ్మడు గ్లామర్ ముందు 4 కోట్లేమి ఖర్మ అంటున్నారట నిర్మాతలు. మరి పూజ క్రేజ్ టాలీవుడ్, బాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఉండడం పూజ కి బాగా కలిసొస్తుంది.

Tags:    

Similar News