వాటికోసం పూజ కష్టాలు

పూజ హెగ్డే ఇప్పటిరకు స్టార్ హీరోల సినిమాల్తో బిజీ అయినప్పటికీ.. ఇంతవరకు డేట్స్ ప్రాబ్లెమ్ అయితే రాలేదు. అందులోను పూజ హెగ్డే వలన ఇప్పటివరకు ఏ హీరో [more]

Update: 2020-03-26 06:06 GMT

పూజ హెగ్డే ఇప్పటిరకు స్టార్ హీరోల సినిమాల్తో బిజీ అయినప్పటికీ.. ఇంతవరకు డేట్స్ ప్రాబ్లెమ్ అయితే రాలేదు. అందులోను పూజ హెగ్డే వలన ఇప్పటివరకు ఏ హీరో డేట్స్ వలన ఇబ్బంది పడలేదు. మహర్షి, అరవింద సమేత, ప్రభాస్ జాన్, హౌస్ ఫుల్ 4 సినిమాలకు రాత్రీపగలూ, మధ్యాన్నం ఇలా నాలుగు సినిమాల షూటింగ్స్ లో ఏక ధాటిగా పాల్గొంది పూజ హెగ్డే. ఏ ఒక్క హీరోని డిస్పాయింట్ చెయ్యలేదు. కానీ తాజాగా పూజ హెగ్డే వలన ఇప్పుడు ఇద్దరు హీరోలకు బాగా ఇబ్బంది వచ్చేలా కనబడుతుంది. తెలుగులో ప్రభాస్ జాన్, అఖిల్ సినిమాలో నటిస్తున్న పూజ జాన్ షూటింగ్ కోసం కరోనా ప్రభావం ఉన్నప్పటికీ… జార్జియా వెళ్ళొచ్చింది పూజ హెగ్డే.

అయితే తాజాగా జాన్, అఖిల్ షూటింగ్స్ కరోనాతో బ్రేకులు పడ్డాయి. కరోనా ప్రభావం ఇప్పటివరకు ఉంటుందో తెలియదు. ఇక ప్రభాస్ డేట్స్, అఖిల్ సినిమా డేట్స్ క్లాష్ వచ్చేలా ఉంది పూజ కి. జార్జియా షెడ్యూల్ పూర్తి చేసిన జాన్ టీం ఇప్పుడు సినిమాలో ని కీలక సన్నివేశాలను తెరక్కించాల్సి ఉంది. ఆ సీన్స్ కి పూజ హెగ్డే డేట్స్ అవసరం. ఇక అఖిల్ సినిమాలోనూ సినిమా మొత్తం పూజ హెగ్డే అఖిల్ తో కనబడాలి. ఆ సినిమా షూటింగ్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మరోపక్క బాలీవుడ్ లో సల్మాన్ సినిమాలో పూజ హెగ్డే నటిస్తుంది. అక్కడ ఆ సినిమాకి డేట్స్ లాక్ చేసి ఉంటారు. కరోనా ప్రభావం తగ్గడమే తరువాయి అందరూ పొలోమంటూ షూటింగ్స్ కి పరిగెడతారు. మరి అందరికన్నా ఎక్కువగా పూజ నే ఎక్కువ ఇబ్బంది పడేలా కనబడుతుంది.పూజ సరిగ్గా అందుబాటులో లేకపోతె సినిమా షూటింగ్స్ లేట్ అయ్యి సినిమాలు అనుకున్న సమయానికి రాలేకపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

Tags:    

Similar News