చరణ్ సరసన పూజ?

చిరంజీవి – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ నిర్విఘ్నంగా సాగుతుంది. కరోనా కల్లోలం నుండి బయట పడి చిరంజీవి ఆచార్య షూటింగ్ కి హాజరవుతున్నారు. [more]

Update: 2020-12-26 06:47 GMT

చిరంజీవి – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ నిర్విఘ్నంగా సాగుతుంది. కరోనా కల్లోలం నుండి బయట పడి చిరంజీవి ఆచార్య షూటింగ్ కి హాజరవుతున్నారు. ఈ సినిమాలో చిరు తనయుడు రామ్ చరణ్ కూడా ఓ ఫుల్ లెంత్ రోల్ ప్లే చేస్తున్న విషయం కొరటాల రివీల్ చేసేసాడు. అంటే ఈ సినిమాలో రామ్ చరణ్ చిరు తో పాటుగా ట్రావెల్ చేస్తాడన్నమాట. అంత కీలక పాత్రకి హీరోయిన్, డ్యూయెట్స్ లాంటివికూడా ఉంటాయని చెప్పాడు కొరటాల. అయితే ఆ హీరోయిన్ పేరుని మాత్రం రివీల్ చెయ్యలేదు.

అయితే దాదాపుగా లక్కీ గర్ల్ రశ్మికనే రామ్ చరణ్ కి జోడి అన్నారు. కానీ తాజాగా రష్మిక డేట్స్ ఖాళీ లేకపోవడం మరో టాప్ హీరోయిన్ పూజ హెగ్డే ని ఆచార్య టీం సంప్రదించినట్టుగా లెటేస్ట్ న్యూస్. ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లోను, ప్రభాస్ రాధేశ్యాం మూవీస్ చేస్తున్న పూజ బాలీవుడ్ లోను బిజీ. అయినప్పటికీ రామ్ చరణ్ కి జోడి అనగానే డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటా కంగారు పడకండి అంటూ పూజ కొరటాలకి మాటిచ్చేసి నట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్. మరి రష్మిక కూడా తెలుగులో పుష్ప పాన్ ఇండియా సినిమాతో పాటుగా శర్వానంద్ ఆడాళ్ళు మీకు జోహార్లతో పాటుగా బాలీవుడ్ లో కి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అసలు ఇప్పుడు ఆచర్యలో రామ్ చరణ్ సరసన నటించబోయేది పూజ నే అనే టాక్ నడుస్తుంది.

Tags:    

Similar News