మనవాడు, మన కాంపౌండు అని కాకుండా నంది అవార్డులు

నంది నాటక అవార్డులను ఐదు విభాగాల్లో అర్హులైన కళాకారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఏపీ ఫిలిం డెవలప్ మెంట్

Update: 2023-07-05 03:07 GMT

నంది నాటక అవార్డులను ఐదు విభాగాల్లో అర్హులైన కళాకారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలిపారు. ఈ ఏడాది నంది నాటక అవార్డులను ప్రధానం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో తనకు కీలక పదవిని ఇచ్చారని అన్నారు. ఆ పదవులు ఇచ్చే సమయంలోనే ఎటు వంటి వివాదాలకు తావులేకుండా నంది నాటక అవార్డులను ఉత్తమ కళాకారులకు అందజేయాలని ఆదేశించారన్నారు. వారి ఆదేశాల మేరకు అర్హులైన కళాకారులకు ఈ నంది నాటక అవార్డులను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే ఒకే సారి సినిమా, టీవీ, నాటక రంగాలకు చెందిన కళాకారులకు నంది అవార్డులు ఇవ్వడం చాలా కష్టమనే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. మొదట పద్య, సాంఘిక, బాలలు, యువజన నాటకాలతో పాటు సాంఘిక నాటిక అనే ఐదు విభాగాల్లోని ఉత్తమ కళాకారులకు ఈ నంది నాటక అవార్డులు ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. ఈ నంది నాటక అవార్డులు ఆ వర్గానికో ఈ వర్గానికో కాకుండా నిజమైన అర్హులకు మాత్రమే ఇవ్వాలన్నదే మా లక్ష్యమన్నారు. నువ్వు నంది అవార్డుల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, అవార్డులు సరిగా ఇవ్వడంలేదని ప్రెస్ మీట్లలో మాట్లాడడం నేను చూస్తూనే ఉన్నాను అని జగన్ గారు చెప్పారని.. వీడు మనవాడు, వీడు మన కాంపౌండు అని కాకుండా సిన్సియర్ గా ఎలా చేస్తావో అలాగే చెయ్యమని చెప్పారన్నారు పోసాని.

1998 నుండి 2004 వరకూ నంది నాటక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాదు రవీంద్రభారతికే పరిమితం అయిపోయిందన్నారు. అయితే 2005 సంవత్సరంలో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత నంది నాటక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జిల్లాల్లో కూడా నిర్వహించడం ప్రారంభం అయిందన్నారు. తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు, నిజామాబాద్ తదితర జిల్లాలలోని ఆడిటోరియంలను పునర్నించడం జరిగిందని ఆయన తెలిపారు. ఏపీలో ఉచితంగా షూటింగ్ లు చేసుకోవచ్చని ఉత్తర్వులే ఉన్నాయని, ఏపీలోనూ సినీపరిశ్రమ అభివృద్ధి చెందేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయటం జరుగుతుందన్నారు. రాష్ట్రం విడిపోయాక సినిమా పరిశ్రమకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నట్లు ఆయన తెలిపారు.


Tags:    

Similar News