ప్రభాస్ ఇప్పట్లో కోలుకోలేడా?

బాహుబలి తర్వాత ప్రభాస్ బాలీవుడ్ కి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని న్యూస్ నడిచింది. కానీ ప్రభాస్ కుర్ర దర్శకుడిని నమ్ముకుని సాహో సినిమా చేసాడు. సాహో సినిమా [more]

Update: 2019-09-01 06:25 GMT

బాహుబలి తర్వాత ప్రభాస్ బాలీవుడ్ కి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని న్యూస్ నడిచింది. కానీ ప్రభాస్ కుర్ర దర్శకుడిని నమ్ముకుని సాహో సినిమా చేసాడు. సాహో సినిమా చేస్తున్నప్పుడు కూడా ప్రభాస్ బాలీవుడ్ స్ట్రయిట్ సినిమా గురించిన వార్తలు ఆగలేదు. కరణ్ జోహార్ నిర్మాతగా ప్రభాస్ ఓ బాలీవుడ్ సినిమా చేస్తున్నాడంటూ హంగామాజరిగింది. కానీ ప్రభాస్ మాత్రం తెలుగు దర్శకులతోనే బాలీవుడ్ మార్కెట్ మీద కన్నేశాడు. ప్రస్తుతం విడుదలైన సాహో సినిమా గనక బ్లాక్ బస్టర్ హిట్ అయితే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆలోచన చేసేవాడేమో.

ఆ ఆలోచనకు…

కానీ సాహో సినిమా దెబ్బకి ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఆలోచన చేసే ధైర్యం ఇప్పట్లో చేస్తాడంటే డౌట్. సాహోనే కాదు… రాధాకృష్ణ సినిమాని నాలుగు భాషల్లో చేస్తున్న ప్రభాస్ కి సాహో కోలుకోలేని దెబ్బేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సాహో ఆలా దెబ్బేస్తే ప్రభాస్ కోలుకోవడానికి టైం పడుతుంది. అయినా ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఆలోచనలు విరమించుకుంటాడో… లేదంటే సాహో పోతే ఏమిటి మరో సినిమా తో గట్టిగా కొడదామని డిసైడ్ అవుతాడో అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఏదైనా ప్రభాస్ కి సాహో భారీగానే షాకిచ్చింది.

Tags:    

Similar News