బాగా కష్టపడుతున్నాడు

సాహో సినిమాలో కాస్త బొద్దుగా కనబడిన ప్రభాస్ ఆ సినిమా విడుదలయ్యాక బాడీ విషయంలో కాస్త ట్రోలింగ్ కి గురయ్యాడు. కండలు పెంచిన ప్రభాస్ ఫేస్ లోని [more]

Update: 2019-09-28 07:26 GMT

సాహో సినిమాలో కాస్త బొద్దుగా కనబడిన ప్రభాస్ ఆ సినిమా విడుదలయ్యాక బాడీ విషయంలో కాస్త ట్రోలింగ్ కి గురయ్యాడు. కండలు పెంచిన ప్రభాస్ ఫేస్ లోని గ్లో కోల్పోవడంతో పాటుగా… బుగ్గలు ఉబ్బినట్టుగా కాస్త ఎబ్బెట్టుగా కనబడిన మాట వాస్తవమే. సాహో సినిమా హిందీ లో విజయ ఢంకా మోగించినా… తెలుగు రాష్ట్రాల్లో ప్లాప్ అవడంతో… ప్రభాస్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ విషయంపై బాగా ఫోకస్ పెట్టాడు. ముందుగా ఆ సినిమా బడ్జెట్ కంట్రోల్ లో పెట్టాడనే టాక్ వినబడింది.

చెమటలు చిందిస్తూ…….

ప్రభాస్ ఫుల్ డైట్ ఫాలో అవుతూ.. ఒళ్ళు తగ్గించే పనిలో పడ్డాడని టాక్ కూడా వినబడింది. తాజాగా ప్రభాస్ ఒళ్ళు తగ్గించే కార్యక్రమంలో బాగా బిజీగా వున్నాడని.. పైన చూస్తున్న ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. తాడుతో వర్కౌట్స్ చేస్తూ బాగా కష్టపడుతున్నాడు. తన ఒళ్ళు తగ్గించుకునే విషయంలో ప్రభాస్ కష్టాలను ఈ ఫోటో చూస్తుంటే తెలిసిపోతుంది. తన జిమ్ ట్రైనర్లు ఆధ్వర్యంలో ప్రభాస్ ఇలా బాడీ వర్కౌట్స్ చేస్తూ చెమట్లు చిందిస్తున్నాడు. సాహో లో బాగా ఒళ్ళుతో కనబడిన ప్రభాస్ పేస్ లో కాస్త వయసు పైబడిన వాడిలా కనిపించాడు. ఇక తాజా వర్కౌట్స్ తో ఒళ్ళు తగ్గించుకోవడంతో పాటుగా… ఫేస్ లోకి గ్లో కూడా తెచ్చుకునే ప్రయత్నంలో జాన్ సినిమా షూటింగ్ కి ప్రభాస్ బ్రేకిచ్చినట్లుగా తెలుస్తుంది

 

Tags:    

Similar News